Home /News /telangana /

CM KCR IS PLANNING TO CHANGE HIS NATIONAL PARTY NAME AS BHARAT RAJYA SAMITHI HERE ARE PARTY FLAG AND ELECTION SYMBOL DETAILS SK

CM KCR: భారత్ రాష్ట్రీయ సమితి కాదు.. మరో కొత్త పేరు.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ వ్యూహం ఇదేనా?

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

CM KCR National Party: జాతీయ పార్టీ పేరు, జెండా, గుర్తులపై నేతలు, నిపుణులు, విశ్లేషకులతో సీఎం కేసీఆర్ తుది విడత మంతనాలు జరుపుతున్నారని.. రేపో మాపో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

    దేశంలో గుణాత్మక మార్పు అవసరమని.. అందుకోసం ఎందాకైనా కొట్లాడుతాననంటున్న సీఎం కేసీఆర్ (CM KCR)..జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ పార్టీ  (KCR National Party)ప్రయత్నాల్లో ఉన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఖాయమని.. అతి త్వరలోనే ప్రకటన ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, గుర్తులపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ముఖ్యనేతలందరితో చర్చించారని.. ఇక ప్రకటనే తరువాయి అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీకి సంబంధించి మరికొన్ని కీలక వివరాలు బయటకొస్తున్నాయి. జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. ఐతే తెలంగాణ రాష్ట్ర సమితే.. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని తాజాగా సమాచారం అందుతోంది.

    CM KCR : కేసీఆర్ జాతీయ ప్లాన్ హైజాక్? -మమతా బెనర్జీ అనూహ్య చర్య -22 మంది నేతలతో ఈనెల 15న..

    ప్రస్తుతం ఉన్న కారు గుర్తునే జాతీయ పార్టీలోనూ యథాతథంగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచాలనుకుంటున్నట్లు సమాచారం. పార్టీ జెండాలో ఉండే తెలంగాణ చిత్రపటం స్థానంలో.. భారతదేశ పటాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి సంబంధించిన కార్యాచరణను శనివారం ప్రారంభించారట.



    మరోవైపు పార్టీ పేరు విషయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి భారత్ రాష్ట్రీయ సమితి (Bharat Rashtriya Samithi) అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ మొదట భావించారు. కానీ తాజాగా 'భారత్ రాజ్య సమితి (Bharat Rajya Samithi)' అనే పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. భారతదేశంలోని రాష్ట్రాల సమాఖ్య లేదా కూటమి అనే అర్థం వచ్చేలా ఉండడంతో.. భారత్ రాజ్య సమితి పేరుపై నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 19న జరిగే రాష్ట్ర కార్యవర్గసమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం.

    కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్ల ప్రారంభం వాయిదా?.. మంత్రి సబితారెడ్డి క్లారిటీ

    ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2797 గుర్తింపు లేని పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), ఆఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (AITMC) జాతీయ పార్టీలు. ఇందులో NCP, NPP, TMCలు మొదట ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ పార్టీలుగా మారాయి. ఇందులో ఎన్సీపీ, ఎన్పీపీ పేర్లు మారలదు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం... పార్టీ పేరుకు ముందు 'అఖిల భారత' అని చేర్చి.. జాతీయ పార్టీగా తీర్మానం చేసి.. ఎన్నికల సంఘానికి పంపింది. దానికి ఈసీ ఆమోద ముద్రవేసింది.

    KTR | Khammam: ఖమ్మంలో మంత్రి కేటీఆర్​ సంచలన కామెంట్స్​.. బీజేపీ, రేవంత్​లపై ఫైర్

    ప్రస్తుతం టీఆర్ఎస్.. తెలంగాణ పేరుతో ఏర్పాటయింది. దానికి జాతీయ స్థాయి రూపు రావడానికి 'భారత్ రాజ్య సమితి'గా మార్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, గుర్తులపై నేతలు, నిపుణులు, విశ్లేషకులతో సీఎం కేసీఆర్ తుది విడత మంతనాలు జరుపుతున్నారని.. రేపో మాపో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత జూన్ 19న జరిగే కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేసి.. ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం. పార్టీ పూర్వ చరిత్ర ఆధారంగా.. దానికి జాతీయ హోదా ఇచ్చి, గుర్తును కేటాయించే వీలుందని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు