హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR Emergency meeting: హై అలర్ట్​.. పోలీస్​ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ అత్యవసర సమావేశం..

CM KCR Emergency meeting: హై అలర్ట్​.. పోలీస్​ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ అత్యవసర సమావేశం..

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

తెలంగాణ  పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.శాంతి భద్రతల సమస్యపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana) పోలీసు ఉన్నతాధికారులతో (Police Officials) సీఎం కేసీఆర్ (CM KCR)  బుధవారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. శాంతి భద్రతల సమస్యపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.  ఈ స‌మావేశానికి (CM KCR Emergency meeting) ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌లో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.


  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  (Raja singh) సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో నేపథ్యంలో హైద్రాబాద్ (Hyderabad) లో ఉద్రిక్త పరిస్థితుులు చోటు చేసుకున్నాయి.పోలీసుల వినతి మేరకు ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయమై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను నిన్న ఉదయమే పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. బీజేపీ తరపు న్యాయవాదుల వాదనతతో రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.  పాతబస్తీలో ఉద్రిక్తత..


  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) వ్యాఖ్యలతో హైదరాబాద్ పాత బస్తీ (Hyderabad Old city Protests) అట్టుడుకుతోంది. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనకు బెయిల్ ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళనలు మిన్నంటాయి. మొగల్‌పురా, శాలిబండ, చంచల్‌గూడ, అలియాబాద్‌, సయ్యద్‌ అలీ చబుత్రా, చార్మినార్‌, లాడ్‌బజార్‌, మీర్‌చౌక్‌, దారుల్‌ షిఫా, గుల్జార్‌ హౌస్‌ ప్రాంతాల్లో యువతపెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తంచేశారుః. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మొగల్‌పురా ప్రాంతంలో పోలీసులపై వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. అలియాబాద్‌ క్రాస్‌ రోడ్డులో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్‌కు తరలించారు.


  Politics: పెళ్లిళ్లే ‘‘రాజకీయ వేదికలు’’.. బడా నేతల ఇళ్లల్లో మోగిపోతున్న బాజాలు


  రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ (Gosha mahal)కు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. సిటీ కాలేజీ చౌరస్తాలో బారీకేడ్లను అడ్డం పెట్టి.. అటు వైపుగా ఎవరినీ వెళ్లనీయడం లేదు. మూసాభౌలీ, హుస్సునీ ఆలం, చార్మినార్, శాలిబండ నుంచి ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని సిటీ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని నచ్చజెప్పారు. సిటీ కాలేజీ నుంచి బేగంబజార్, హైకోర్టుకు వెళ్లే రహదారులను మూసివేశారు. పాతబస్తీలో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజాసింగ్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారని ఆందోళనకారులు మండిపడుతున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై జైల్లో వేసి.. కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత బస్తీలో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hindu community leaders, Hyderabad police, Muslim Minorities, Old city, Raja Singh

  ఉత్తమ కథలు