Dharani Portal: ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావులేదు.. ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్..

రెవెన్యూ సేవలను సులభంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు.

news18-telugu
Updated: October 29, 2020, 2:14 PM IST
Dharani Portal: ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావులేదు.. ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్..
ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
  • Share this:
రెవెన్యూ సేవలను సులభంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ధరణి పోర్టల్‌ను లాంచ్ చేశారు. దీంతో నేటి నుంచి తెలంగాణలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రి మ‌ల్లారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లుతో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో అక్రమ రిజిస్ట్రషన్లకు తావు ఉండదని స్పష్టం చేశారు. తప్పు చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. రైతుల భూములకు రక్షణ కల్పించేందుకు ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేశామని వెల్లడించారు.

తప్పులు జరిగితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయని.. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుని తప్పులు చోటుచేసుకుండా చూస్తున్నట్టు చెప్పారు. ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని.. వాటి ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని సీఎం వివరించారు. తెలంగాణలో నేటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని సీఎం స్పష్టం చేశారు. కొత్తగా జరిగే క్రయ, విక్రయాల నమోదు 15 నిమిషాల్లో పూర్తి అవుతాయని.. రైతులు కార్యాలయాలు చుట్టూ తిరిగే కర్మ ఉండదని తెలిపారు.

రిజిస్ట్రేషన్ చార్జీల్లో ఒక్క పైసా కూడా పెంచలేదని.. పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించే బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. సాయం చేయడానికి డాక్యూమెంట్ రైటర్లు కూడా అందుబాటులో ఉంటారని.. వాళ్లు గతంలో మాదిరి ఎలా పడితే అలా రుసుం వసూలు చేయడానికి వీల్లేదని కేసీఆర్ తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: October 29, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading