హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: ఛలో హాలియా.. నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏం చెప్పబోతున్నారు?

CM KCR: ఛలో హాలియా.. నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏం చెప్పబోతున్నారు?

హాలియాలో అలీనగర్‌ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ సభను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ ప్రారంభం కానుంది. 2 లక్షల మందికిపైగా సభకు హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు

హాలియాలో అలీనగర్‌ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ సభను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ ప్రారంభం కానుంది. 2 లక్షల మందికిపైగా సభకు హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు

హాలియాలో అలీనగర్‌ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ సభను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ ప్రారంభం కానుంది. 2 లక్షల మందికిపైగా సభకు హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు

  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఇవాళ హాలియాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే బహిరంగసభకు ఉమ్మడి నల్గొండ నుంచి పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావు, మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌ సహా పలువురు నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  హాలియాలో అలీనగర్‌ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ సభను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ ప్రారంభం కానుంది. 2 లక్షల మందికిపైగా సభకు హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేతలు కూడా ఒక్కొక్కరుగా సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఐతే ఈ సమావేశంలో సాగర్ అభ్యర్థిపైనా క్లారిటీ వచ్చే అవకాశముంది. ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ కుటుంబానికే టికెట్ ఇస్తారా? లేదంటే దుబ్బాక పాఠాలతో వేరొకరికి టికెట్ ఇస్తారా? అనే దానిపై ఇవాళ స్పష్టత రావొచ్చు. ఎన్నికల నేపథ్యంలో నాగార్జున సాగర్‌పై సీఎం కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


  ఇక రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో పలు అంశాలపైనా సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలను మరోసారి ప్రస్తావించనున్నారని.. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఈ సభ వేదికగా మరోసారి కేసీఆర్‌ స్పష్టతనిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గత ఆరున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడతో పాటు రాబోయే రోజుల్లో ఏమేం చేయబోతున్నారో కూడా చెప్పే అవకాశాలున్నాయి. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో.. తమ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని ఈ సభ నుంచి కేసీఆర్‌ పిలుపునిచ్చే అవకాశముంది.

  త్వరలో పశ్చిమ బంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. వాటితో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలవుతుంది. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహ్మయ్య కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. టికెట్ కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశముంది. బీజేపీ నుంచి బీసీ నేత కడారి అంజయ్యతో పాటు నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిస్తోంది.

  First published:

  Tags: CM KCR, Nagarjuna sagar, Nagarjuna Sagar By-election, Telangana

  ఉత్తమ కథలు