CM KCR HELD MEETING ON SSC EXAMS ISSUE IN PRAGATHI BHAWAN SK
పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
సీఎం కేసీఆర్
పరీక్షలను రద్దు చేయాలా? నిర్వహించాలా? ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి? వంటి అంశాలపై చర్చించనున్నారు. అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అకాశముంది. టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, హైకోర్టు సూచనల నేపథ్యంలో పరీక్షలపై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పరీక్షలను రద్దు చేయాలా? నిర్వహించాలా? ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి? వంటి అంశాలపై చర్చించనున్నారు. అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులోనూ కేసు నడించిది. ఐతే జీహెచ్ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి విద్యార్థులకు సప్లిమెంటరీలో అవకాశం కల్పించి.. ఫలితాల్లో మాత్రం రెగ్యులర్గా పరిగణించాలని స్పష్టం చేసింది. ఐతే వేర్వేరుగా పరీక్షలు పెడితే ప్రశ్నాపత్రం తయారుచేయడం కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం.. రాష్ట్రమంతటా పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మరి పరీక్షలు నిర్వహించాలా? రద్దు చేయాలా? అనే దానిపై ఇవాళ్టి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశహుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.