హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: తెలంగాణలో సంపద సృష్టి.. మే డే స్ఫూర్తి: ఆ పనికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు

CM KCR: తెలంగాణలో సంపద సృష్టి.. మే డే స్ఫూర్తి: ఆ పనికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

మే డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు.

ఇంకా చదవండి ...

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మే 1) మే డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకొంటూ విజయవంతంగా అమలవుతున్నదని కేసీఆర్ చెప్పారు.

వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని, అది దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు.

International Workers Day: నేడు మే డే : ప్రపంచ కార్మిక దినోత్సవం.. పోరాడితే పోయేదేమీ లేదంటూ..


కార్మికుల సంక్షేమం కోసం 2021-22 తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాలను రాష్ట్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, సంఘటిత, అసంఘటిత రంగం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నదని, గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మందికి రూ.184.07 కోట్ల లబ్ధి చేకూర్చిందని కుముదిని పేర్కొన్నారు. కార్మికశాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్నదని ఆమె గుర్తుచేశారు.

Petrol Diesel బంపర్ ఛాన్స్: తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే Business Idea ఇది..


మేడే సందర్భంగా కార్మికులకు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి రావడంతో ఈసారి మేడే ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మేడే సందర్భంగా ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో శ్రమ శక్తి అవార్డులు, ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులు అందజేయనున్నట్టు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Governor Tamilisai, Labour, Telangana

ఉత్తమ కథలు