Home /News /telangana /

CM KCR GOES TO DELHI TODAY TO CLEAR THE PADDY ISSUE VRY

CM KCR : సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి.. వరి కోనుగోలుపై తేల్చుకునేందుకు రెఢి

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR : ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుండి స్పష్టత కోసం నేడు సీఎం కేసిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రులు,అధికారులతోపాటు రెండు రోజులప పాటు అక్కడే ఉండి అవసరమైతే ప్రధానిని సైతం కలిసి చర్చించనున్నారు.

    సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి విధించిన గడువు తీరి పోయింది. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించిన అనంతరం కేంద్రానికి రెండు రోజుల పాటు గడువు విధించారు. అయితే కేంద్రం నుండి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చెప్పడంతో పాటు రభీ సీజన్‌లో వరిధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఇదే అంశంపై కేంద్రంతో చర్చించి పూర్తి స్పష్టత తీసుకువచ్చేందుకు నేడు ఢిల్లీ వెళుతున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా సీఎంతో పాటు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, అందుబాటులో ఉన్న మంత్రులతో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ఢిల్లీలోనే రెండు రోజుల పాటు ఉండనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే.. పీఎం నరేంద్ర మోదీని సైతం కలుస్తామని చెప్పారు.

    కాగా శనివారం మీడియాతో మాట్లాడిన సీఎం పలు అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా పంటల కొనుగోలుపై ముందే స్పష్టత ఇచ్చి టార్గెట్ పెట్టాలని కోరారు. దీంతో పంటల మార్పిడి , ఉత్పత్తి ఎలాంటీ ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉండవని చెప్పారు. ఇక రానున్న వేసవి కాలం వరిధాన్యం కొనుగోలుపై పూర్తిస్థాయి స్పష్టత తీసుకుని వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ పంట వేయాలనే దానిపై వివరణ ఇస్తామని చెప్పారు.

     ఇది చదవండి : పాతవారికే తిరిగి ఎమ్మెల్సీలు... ఎల్లుండి నామినేషన్స్


    మరోవైపు వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు ఎమ్ఎస్‌పీని చట్టపరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతు పోరాటంలో చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.  అంతకు మందే పోరాటంలో చనిపోయిన సుమారు 700 మంది రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు..దీంతో పాటు  విద్యుత్ చట్టాల అమలుపై కూడా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావద్దని అన్నారు. మరోవైపు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆత్మనిర్భర్ క్రిషక్ అవసరమని ఆయన నొక్కి చెప్పారు.దీంతోపాటు రాష్ట్రంలోని నీటి సమస్యలపై ట్రిబ్యునల్ వేసి వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Delhi, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు