Home /News /telangana /

CM KCR GOES TO DELHI FOR TAKING TREATMENT FOR TEETH TODAY VRY

CM KCR : కాసేపట్లో.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో...కారణం ఇదే...

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

CM KCR : సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. పంటినొప్పి కారణంగా చికిత్స తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.

    సీఎం కేసీఆర్ మరోసారి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.. తన వ్యక్తిగత అంశంపై ఆయన ఢిల్లీవెళ్లనున్నట్టు సమాచారం. గత కొద్ది రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పంటి చికిత్స కోసం ఆయన ఢిల్లీ వెళుతున్నారు.. మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన బయలు దేరనున్నారు. కాగ గత నెల క్రితం కూడా చికిత్స కోసం తన భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారించారు.

    అయితే నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం తిరిగి ఎప్పుడు వస్తారనే సమాచారం మాత్రం లేదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ ఇటివలే మరోసారి తన మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. దీంతో తాను సైతం ఢిల్లీకి వెళతారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం వెళ్లలేద.. కాని పంటినొప్పి కారణంగా ఆయన ఢిల్లీ వెళుతుండడం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Delhi

    తదుపరి వార్తలు