హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన మున్సిపల్ అధికారులు.. ఉదయం వెలిసింది.. సాయంత్రం..

Hyderabad : సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన మున్సిపల్ అధికారులు.. ఉదయం వెలిసింది.. సాయంత్రం..

Hyderabad : విజయవాడలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని స్థానిక మున్సిపల్ అధికారలు శనివారం సాయంత్రం తొలగించారు. కాగా సీఎం కేసిఆర్ ఫ్లెక్సి ఏర్పాటుతో రాజకీయాంగా కూడా అసక్తికర చర్చ జరిగింది.

  పవన్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన బీమ్లానాయక్ సినిమా రిలీజ్ సంధర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ హ్యాట్సాఫ్ చెబుతూ ఏకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాగా సినిమా విడుదల సంధర్బంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవడం తోపాటు ఐదో షోకు అనుమతులు ఇచ్చింది. దీంతో సీఎం కేసిఆర్‌తో పాటు మంత్రులు కేటిఆర్, సినిమటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లతో పాటు విజయవాడకు చెందిన వంగవీటి రంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ తోపాటు జనసేన పార్టీ నాయకుడు నాదేండ్ల మనోహర్ ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టారు.

  మరోవైపు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా తెలంగాణ మంత్రి కేటిఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస యాదవ్‌లు హజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాన్ కేటిఆర్‌తో పాటు సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత కూడా ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. మరోవైపు ఏపీలో బీమ్లానాయక్ సినిమా విడుదలపై పలు ఏపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుదల విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా కూడా విమర్శల పాలు అవుతోంది. మరోవైపు పవన్‌కళ్యాన్ పై వైసీపీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటీవ్ గా స్పందించి స్వయంగా మంత్రి కేటిఆర్ పాల్గొనడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీ దుమారం రేపింది. దీంతో డామేజ్ కంట్రోల్‌కు స్థానిక అధికారులు చర్యలు చేపట్టినట్టు సమాచారం.

  Adilabad : అడవి నుండి అంతర్జాతీయ స్థాయికి.. ఏషియన్ ఉమెన్ గేమ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా క్రిడాకారిణి...

  సీఎం కేసిఆర్‌కు ఏపీలో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.  ఆయన అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు అనేక సార్లు ఆయన ఫ్లేక్సిలను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పలు రాజకీయ సంధర్భాలతో పాటు ఆయన బర్త్‌ డే సంధర్భంగా అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అప్పుడు ఎలాంటి వ్యతిరేకత కనబరచని ఏపీ ప్రభుత్వం ఏకంగా సీఎం ఫ్లెక్సీని తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

  First published:

  Tags: CM KCR, Pawankalyan