Home /News /telangana /

CM KCR FIRES ON CENTRAL GOVT AT VANAPARTHY MEETING VRY

CM KCR : మత పిచ్చి లేపి, దేశాన్ని నాశనం చేసేవాళ్లను బంగాళఖాతంలో కలపండి.. !

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR : మత కల్లోలాలు సృష్టించి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీని బంగాళాఖాతంలో కలపాలాని సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి శక్తులకు అవకాశాలు రానివ్వని శపథం చేశారు..

  వనపర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు.. ప్రధాని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలని ఆ సంధర్భంగా అన్నారు... ఈ ప‌నికిమాలిన మ‌త‌పిచ్చిగాళ్ల‌ను కూక‌టి వేళ్ల‌తో పెకిలించి.. బంగాళాఖాతంలో విసిరేయాల‌ని నేను మ‌న‌వి చేస్తున్నానన్నారు. అప్పుడే మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయని అన్నారు... రాష్ట్ర వాల్మీకీ బోయ‌ల‌కు గిరిజ‌న ప‌ద్ధ‌తిలో రావాల‌న్నా.. గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. రాష్ట్రం ముందుకు పోవాల‌న్నా.. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉన్న కాషాయ జెండాల‌ను.. భార‌తీయ జ‌న‌తా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాల‌ని మ‌న‌వి చేస్తున్నాని అన్నారు.. దాని కోసం రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉండాలని అన్నారు.

  మరోవైపు దుర్మార్గ‌మైన ప‌ద్ధ‌తిలో ఈ దేశాన్ని నాశ‌నం చేసే వాళ్లకు.. ప్ర‌జ‌ల‌కు మ‌త పిచ్చి లేపి దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసేవాళ్ల‌కు బుద్ధి చెప్ప‌డానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. దేశ రాజ‌కీయాల‌ను కూడా చైత‌న్య ప‌రుస్తా. మ‌డ‌మ వెన‌క్కి తిప్ప‌కుండా ముందుకు సాగి.. బంగారు తెలంగాణ లాంటి బంగారు భార‌తదేశాన్ని కూడా త‌యారు చేయ‌డానికి పురోగ‌మిద్దామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అరాచశక్తులకు అవకాశం ఇవ్వనివ్వనని అన్నారు. దేశం కోసం పోరాటానికి ముందుకు పోవాలని అన్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Telangana

  తదుపరి వార్తలు