CM KCR FIRES ON AP GOVT FOR KRISHNA WATER DISPUTES VRY
CM KCR : ఏపీ దాదాగిరి చేస్తోంది... సాగర్ సభలో సీఎం కేసీఆర్ ఫైర్
సీఎం కేసీఆర్
CM KCR : కృష్ణానదీ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం సైతం దాదాగిరి చేస్తోందని సీఎం కేసిఆర్ మండిపడ్డారు.రెండు ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై ఆయన ఫైర్ అయ్యారు.రానున్న రోజుల్లో కూడా ఏపీ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి కేసిఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. నేడు నాగార్జున సాగర్లో పర్యటించిన ఆయన.. హాలియాలో నిర్వహించిన సభలో నీటి వివాదాన్ని ప్రస్తావించారు.ఎవరు దాదాగిరి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.. ఈ క్రమంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నీటి వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు.
మరోవైపు సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు.ఇందులో భాగంగానే పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు చాలా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. పెద్దదేవులపల్లి – పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్, హుజూర్నగర్లో ఒక్కొక్క లిఫ్ట్ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వీటన్నింటిని ఏడాదిన్నరలోపే పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.