హోమ్ /వార్తలు /తెలంగాణ /

cm kcr : సమయం లేదు మిత్రమా! -ప్రగతి భవన్‌లోనే పాడి కౌశిక్ రెడ్డి -mlc అభ్యర్థుల జాబితా

cm kcr : సమయం లేదు మిత్రమా! -ప్రగతి భవన్‌లోనే పాడి కౌశిక్ రెడ్డి -mlc అభ్యర్థుల జాబితా

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ(16 నవంబర్ తో) నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 3లోగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ కు సంబంధించి.. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులకు ప్రగతి భవన్‌ నుంచి ఫోన్లు వెళ్లాయి..

ఇంకా చదవండి ...

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల్లో నరాలు తెగిపోయే ఉత్కంఠ కొనసాగుతున్నది. నామినేషన్లకు తుది గడుము ముంచుకొస్తున్నా.. అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే పూర్తిచేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రకటనన ప్రక్రియను నింపాదిగా చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా మరికాసేపట్లో వెలువడనుంది. ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇప్పటి వరకు ముగ్గురి పేర్లు వెల్లడికాగా, పూర్తి జాబితాపై ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ(16 నవంబర్ తో) నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 3లోగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ కు సంబంధించి.. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులకు ప్రగతి భవన్‌ నుంచి ఫోన్లు వెళ్లాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలిత ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ బెర్త్‌ ఓకే చేసినట్లు సమాచారం.

Ravana : సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణుడికి నిజంగా విమానం ఉంది! శ్రీలంక పరిశోధనకు భారత్ సహాయం -రావణాసురుడు తొలి ఏవియేటర్


వరంగల్‌ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెళ్లపల్లి రవీందరావు, నల్గొండ జిల్లా నుంచి శాసన మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ స్వయంగా వారికి ఫోన్లు చేసి సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. పెండింగ్‌లోని మూడు స్థానాల కోసం నలుగురు రేసులో ఉన్నారు. ఈ నలుగురు అభ్యర్థుల్లో ఒకరిని పక్కన పెట్టి..

Etela Rajender ఆ పని చేయగలరా? -cm kcrకు షాకిచ్చేలా bjp సరికొత్త వ్యూహం ఇదే..


సిద్దిపేట జిల్లా కలెక్టర్ పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించిన వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్యేల కోటాలోనే ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రాబబుల్స్ జాబితా నుంచి ఒకరు ఔటనట్లే. అయితే ఇప్పుడు టికెట్ మిస్ అయినవాళ్లకు రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. హుజూరాబాద్ పరిణామాల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఇక మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ కోటలో మండలికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థుల‌ను శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేత‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు. మరో వైపు ఇవాళ సాయంత్రం..

cm kcr : పాడి కౌశిక్ రెడ్డికి షాకా? స్వీటా? -trs కీలక నేతలతో సీఎం కేసీఆర్ భేటీ -mlc అభ్యర్థుల ఎంపిక


తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఎల్పీ భేటి జరుగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులకు సమావేశానికి ఆహ్వానం పంపారు. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం అవలంభిస్తున్న విధానంపై చర్చించనున్నారు. కేంద్రంపై పోరుకు కేసీఆర్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ నెల 29 న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: CM KCR, Mlc elections, Trs

ఉత్తమ కథలు