Home /News /telangana /

cm kcr అనూహ్య ఎంపిక -కవిత సహా సిట్టింగ్‌లకు షాక్ -trs mlc అభ్యర్థుల జాబితా ఇదే!

cm kcr అనూహ్య ఎంపిక -కవిత సహా సిట్టింగ్‌లకు షాక్ -trs mlc అభ్యర్థుల జాబితా ఇదే!

కవిత, కేసీఆర్.

కవిత, కేసీఆర్.

స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీల భర్తీ విషయంలోనూ సీఎం కేసీఆర్ అనూహ్య ఎంపికలు చేశారు. సగానికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్సీలకు షాకిచ్చారు. రెండోసారి అవకాశం దక్కని ఎమ్మెల్సీల్లో సీఎం కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవిత కూడా ఉండటం గమనార్హం.

ఇంకా చదవండి ...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Elections) ల్లో అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) షాకుల పరంపరను కొనసాగించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల ఎంపికలో సంచలన రీతిలో ఎంపీని, జిల్లా కలెక్టర్ ను రాజీనామా చేయించిమరీ అవకాశం కల్పించిన ఆయన.. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీల భర్తీ విషయంలోనూ అనూహ్య ఎంపికలు చేశారు. సగానికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్సీలకు షాకిచ్చారు గులాబీ బాస్. రెండోసారి అవకాశం దక్కని ఎమ్మెల్సీల్లో సీఎం కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కూడా ఉండటం గమనార్హం. ఆదివారం నాడు ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీన జాబితాను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం స్థానిక కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది..

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ మరో నాలుగు రోజులపాటు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బయలుదేరడానికి ముందే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. శనివారం రాత్రి ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీల ఎంపికను పూర్తి చేసి, ఆమేరకు నేతలకు సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల మాదిరిగానే స్థానిక కోటా ఎమ్మెల్సీల విషయంలోనూ కేసీఆర్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు..

kalvakuntla kavitha : మళ్లీ పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్న cm kcr కూతురు! -trs mlc భారీ ట్విస్టులు


స్థానిక కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, అందులో ఏడుగురు సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. వారి స్థానంలో ఏడుగురూ కొత్తవారికి అవకాశం కల్పించారు. మొత్తం 12 పదవుల్లో.. బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 కేటాయించారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఇప్పటికే బీఫామ్ లు అందాయని, వారంతా సోమవారమే నామినేషన్లు వేయనున్నారని తెలుస్తోంది. జాబితాలోని పేర్లు ఇలా ఉన్నాయి..

భువనేశ్వరి ఉదంతంలో కీలక మలుపు -అసెంబ్లీ ఫుటేజ్ కోసం టీడీపీ పట్టు -చంద్రబాబుకు సోనూ సూద్ ఫోన్


మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. మహబూబ్‌నగర్‌లో ఒకరికి, కరీంనగర్‌లో ఒకరికి కొత్తవారికి అవకాశం కల్పించారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లాలో రెండో స్థానంనుంచి ఆయన పేరును ఖరారు చేశారు. ఖమ్మం నుంచి తాత మధు, ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, మహబూబ్‌నగర్-2 నుంచి సాయిచంద్, నల్గొండ నుంచి కోటిరెడ్డి, మెదక్ నుంచి యాదవ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ఆకుల లలితకు అవకాశం కొత్తగా అవకాశం కల్పించారు. అయితే, ఈ పేర్లను పార్టీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన డ్రామా నెవర్ బిఫోర్..


పై జాబితాలోని వాళ్లలో కొందరు గతంలో ఇతర కోటాల నుంచి ఎమ్మెల్సీగా పనిచేసినవాళ్లూ ఉన్నారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీలైన పురాణం సతీష్, నారదాసు, దామోదర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, చిన్నపరెడ్డి, కల్వకుంట్ల కవితకు అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఇటీవలే గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, పాడి కౌశిక్ రెడ్డి, టి.రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డిలునామినేషన్లు వేయడం తెలిసిందే. వారి ఎన్నిక లాంఛనమే.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Kalvakuntla Kavitha, Mlc elections, Trs

తదుపరి వార్తలు