మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో కోల్హాపూర్కు చేరుకోగా.. సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు.
కాగా దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం చాలా విశిష్టమైనదిగా చెబుతారు. ప్రళయం వచ్చినప్పుడు లక్ష్మిదేవి సైతం ఈ ప్రాంతాన్ని పైకి ఎత్తి పురాణా గాథాలు చెబతున్నాయి. కాగా పంచగంగ నదీ ఒడ్డున్న ఈ ఆలయాన్ని పలువురు ప్రముఖులు సైతం దర్శించుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Maharashtra