CM KCR EXPRESSED CONDOLENCES OVER THE DEATH OF SIRIVENNELA SEETHARAMA SASTRY VRY
Sirivennela Seetharama Sastry : ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు.. సీఎం సంతాపం
Sirivennela Seetharama Sastry
Sirivennela Seetharama Sastry :ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతోపాటు రాష్ట్ర మంత్రులు , ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సిఎం తెలిపారు. ( Sirivennela Seetharama Sastry )సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. ( Sirivennela Seetharama Sastry ) సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రజల హృదయాలను గెలుచుకున్న గేయ రచయిత సిరివెన్నల మృతి తీరని లోటని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు.
Deeply saddened to hear the news of Sri #SirivennelaSitaramasastri Garu’s demise. A great lyricist who has given us the most beautiful songs to reminisce and who won the hearts of people with his incredible work. Condolences to the family. pic.twitter.com/LIbuf0cyqF
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ప్రశ్నించిన గొంతు మూగపోయిందని సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం పట్ల మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీష్‌రెడ్డి సంతాపం తెలిపారు. సీతారామ శాస్త్రి సాహిత్య రంగానికి చేసిన సేవ మరచిపోలేనిదని, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు.
భౌతికంగా మరణించినా..ఆయన పాటలతో చిరకాలం చిరంజీవిలా బ్రతికే ఉంటారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ( Sirivennela Seetharama Sastry ) ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే సిరివెన్నెల మృతి పట్ల చేవెళ్ల లోక్ ఎంపీ డా.జి రంజిత్ రెడ్డి సంతాపం తెలిపారు.వారు రాసిన పాటలు చాలా మంది నిజ జీవితాల్లో గుణపాఠాలు అయి ఎందరికో జీవితాన్ని ఇచ్చారని అన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.