KCR Yadadri Tour: కారు ఆపి కోతులకు అరటి పండ్లు ఇచ్చిన కేసీఆర్

KCR in Yadadri: గుంపులు గుంపులుగా కోతులు ఉండటం చూసి తన కాన్వాయ్‌ను ఆపిన సీఎం కేసీఆర్.. కారులో నుంచి దిగి కాసేపు అగారు.

news18-telugu
Updated: September 13, 2020, 6:20 PM IST
KCR Yadadri Tour: కారు ఆపి కోతులకు అరటి పండ్లు ఇచ్చిన కేసీఆర్
కోతులకు అరటి పండ్లు ఇస్తున్న సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ యాద్రాద్రిలో కోతులకు అరటి పండ్లను ఇచ్చారు. యాదాద్రిలో పనులను సమీక్షించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్... తిరుగు ప్రయాణంలో కోతులను చూసి కారు ఆపారు. గుంపులు గుంపులుగా కోతులు ఉండటం చూసి తన కాన్వాయ్‌ను ఆపిన సీఎం కేసీఆర్.. కారులో నుంచి దిగి కాసేపు అగారు. కోతుల గుంపును చూసి వాటికి అరటి పండ్లు ఇచ్చారు. గుంపులు గుంపులుగా వచ్చిన కోతులకు తన భద్రతా సిబ్బందితో కలిసి అరటి పండ్లను అందజేశారు. ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అంతకుముందు ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌కు అశ్వీరచనాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొండ కింద నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు, ప్రెసిడెంట్ సూట్ సహా పలు నిర్మాణలకు సంబంధించిన పురోగతిని సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 13, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading