వరి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ , బీజేపీ రాజకీయ ఎత్తుగడలతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. దీంతో ఎవరు ఎం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర రైతంగం కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఇరు పార్టీలు తమ పంతం కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శ రెండు పార్టీలపై చెలరేగుతోంది.
కాగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం అస్పష్ట వైఖరి కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కేంద్రంపై మండిపడుతూనే.. ( cm kcr appointment dispute ) వరి ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తెల్చుకునేందుకు సీఎం కేసీఆర్ తన మంత్రులు, అధికారుల బృందంతో కలిసి వెళ్లారు. అంతకు ముందు ఇందిరా పార్క్ వద్ద కేంద్రం వైఖరి నిరసిస్తూ ఒకరోజు ధర్నా కూడా చేశారు.. అనంతరం మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్‌కు ప్లాన్ చేసి గడిచిన ఆదివారం తన బృందంతో కలిసి వెళ్లారు.. మూడు రోజుల పాటు అక్కడే మాకం వేశారు. ( cm kcr appointment dispute )కాని సీఎం కేసిఆర్ అపాయింట్‌మెంట్ ప్రధాని మోదీతోపాటు ఇతర మంత్రులు ఇవ్వలేదన్నదని టీఆర్ఎస్ వర్గాల ఆరోపణ. అందుకే కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రి పియూష్ గోయల్‌ను కలిసి చర్చించారు. కాని ఆయన కూడా సరైన స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయమని స్పష్టం చేశారు.
Siddipet : పాము కరిస్తే, పసుపు పెట్టి.. కట్టు కట్టింది. నిద్ర కూడ పొమ్మంది...! కాని ఆ పాప ...మాత్రం..
దీంతో వెనుదిరిగిన టీఆర్ఎస్ బృందం కేంద్రం తెలంగాణ నేతలు మరోసారి అవమానాలకు గురి చేసిందని చెప్పారు. కనీసం సీఎంతో చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు.దీంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. కేంద్రం వైఖరిని తూర్పార బట్టారు. దీంతో రాజకీయం మరింత ముదిరింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తూనే... తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రకటన చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,( pm modi) కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలువడానికి తెలంగాణ సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుండి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని స్పష్టం చేశాయి. అయితే.. గత సెప్టెంబర్ 1వ తేదీన అపాయింట్‌మెంట్ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్‌మెంట్ ఇవ్వడం, సీఎం కేసీఆర్ మోదీ, అమిత్ షాను కలవడం జరిగిందని తెలిపాయి. ( cm kcr appointment dispute ) తాజాగా మాత్రం ఎలాంటీ అపాయింట్‌మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పేర్కొన్నాయి.
TS MLC : ఒక్క సీటైనా గెలవాలి... కరీంనగర్‌లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులు ఏకతాటిపైకి .. ?
దీంతో సీఎం కేసీఆర్ ( cm kcr ) మరోసారి ఇరుకున పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓవైపు వానాకాలం వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సీఎం కేసిఆర్ రానున్నా యాసంగి ధాన్యం కొసం పోరాటం చేయడం కూడా రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. దీనికి తోడు మూడు రోజుల పాటు డిల్లీలో మకాం వేసిన ఆయన సాధించింది ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు రైతుల్లో చర్చ మొదలైంది. దీంతో మరోసారి సీఎం కేసిర్ ఎత్తుగడ భూంరాంగ్ అయిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.