హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | Munugodu By elections: ‘‘ సమాధానం చెప్పు బిడ్డ అమిత్​ షా.. మాకు ఆ నీళ్లెందుకు ఇవ్వడం లేదు.. ’’: సీఎం కేసీఆర్​

CM KCR | Munugodu By elections: ‘‘ సమాధానం చెప్పు బిడ్డ అమిత్​ షా.. మాకు ఆ నీళ్లెందుకు ఇవ్వడం లేదు.. ’’: సీఎం కేసీఆర్​

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ మునుగోడుకు చేరుకున్నారు. మునుగోడులో ప్రజాదీవెన సభా వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే రాజగోపాల్​ రాజీనామాతో పోటాపోటీ బహిరంగ సభలతో మునుగోడు ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే మునుగోడు (Munugodu Bypoll)లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఆ సభకు హాజరయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ (TRS), బీజేపీల వంతు వచ్చింది. శనివారం టీఆర్ఎస్, ఆదివారం బీజేపీ సభలు తలపెట్టాయి. శనివారం మునుగోడులో జరగనున్న సభకు సీఎం కేసీఆర్ (CM KCR) హాజరయ్యారు.

  హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్ (CM KCR) సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మునుగోడులో ప్రజాదీవెన సభ వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. వేదికపై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధికారం ఎవరికి పడితే వారికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. దేశంలో ఉన్న ప్రగతి శీల పార్టీలను ఏకం  చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

  గతంలో ఏ ప్రభుత్వం కూడా మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధపడిందో అందరం చూశామని అన్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదని అన్నారు. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చడం లేదు చెప్పాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. ఏ కారణం చేత వాయిదా వేస్తున్నారని కేంద్రాన్ని కేసీఆర్​ ప్రశ్నించారు. ఇదే గడ్డ మీద నుంచి అడుగుతున్న సమాధానం చెప్పు బిడ్డ అమిత్​ షా అన్నారు కేసీఆర్​.  రేపు మునుగోడులో కృష్ణా జలాలపై పెదవి విప్పాలని అమిత్​ షాను కేసీఆర్​ డిమాండ్​ చేశారు. రాజగోపాల్​ రెడ్డి ఢిల్లీకి పోయి ఈ ప్రాంతానికి రావాల్సిన జలాలపై అడగడం లేడని సీఎం మండిపడ్డారు.

  ఇదేం అరాచకం?

  ప్రభుత్వాలను ఏక్​నాథ్​ షిండేలా పడగొడుతానంటున్నారు? ఇది దేశమా? అరాచకమా? అని కేసీఆర్బీజేపీని ప్రశ్నించారు. నాయకులపై ఈడీ కేసులు పెడతానంటున్నారు.. ఈడీ..నా బోడినా అన్నారు సీఎం. ఏం పిక్కుంటవో పీక్కో అని కేసీఆర్​ అన్నారు. నీకు భయపడేది లేదు మోదీ.. అన్నారు.

  ఒకప్పుడు ఎడారిగా మారుతుందన్న జిల్లాను.. కేసీఆర్ సస్యశ్యామలంగా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికపై నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసీని సీఎం కేసీఆర్ పారదోలారని అన్నారు. గతంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా నల్గొండ ఫ్లోరైడ్ రక్కసీ గురించి చెప్పేవారు. 20 ఏళ్ల కిందటే కేసీఆర్ ఈ సమస్య పరిష్కారానికి ఆలోచించేవారని చెప్పారు. 2014కు ముందు మునుగోడులో దీన పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని అన్నారు. మోదీతో , బీజేపీతో కోట్లాలో టీఆర్ఎస్‌తో కలిసివస్తామని చెప్పిన సీపీఎం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Munugodu By Election

  ఉత్తమ కథలు