హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త పార్టీకి సొంత విమానం.. రూ.80 కోట్ల విరాళాల సేకరణ

KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త పార్టీకి సొంత విమానం.. రూ.80 కోట్ల విరాళాల సేకరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CM KCR: అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. భారతీయ రాష్ట్ర సమితి (BRS) లేదా భారతీయ రైతు సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇప్పుడు తెలంగాణ అంతటా కేసీఆర్ (KCR New Party) కొత్త పార్టీ గురించే చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆయన.. దసరా (Dussehra) రోజు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) భారతీయ రైతు సమితి (BRS)గా మారుతుందని ప్రచారం జరుగుతుంది. ఐతే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో మాత్రమే ఎక్కువగా పర్యటిస్తున్నారు. కానీ కొత్త పార్టీ పెట్టిన తర్వాత.. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తారు. అందుకోసం ప్రతిసారీ విమానాన్ని అద్దెకు తీసుకోకుండా.. సొంతంగా విమానం కోనుగోలు చేయనున్నారు.

  దసరా సెలవులకు వెళ్తున్న వారికి శుభవార్త.. 12 స్పెషల్ ట్రైన్లు ప్రకటన.. తేదీలు, టైమింగ్స్

  ప్రత్యేక చార్టెర్డ్ ఫ్లైట్ కోసం దాదాపు రూ.80 కోట్లను వెచ్చించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ విమానంలో 12 సీట్లుంటాయి. దసరా రోజునే దీని కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వనున్నారు. అక్టోబరు 5న దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారు. ఆ ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు టీఆర్ఎస్ పార్టీ ఆర్డర్ ఇస్తుందందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ ఖజానాలో దాదాపు రూ.900 కోట్ల మేర నిధులున్నాయి. కానీ విమానం కొనుగోలుకు ఆ డబ్బును ఖర్చుచేయకుండా.. పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి విరాళాలు సేకరించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందట.

  జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్ కొంత కాలంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఆ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకొని వినియోగిస్తున్నారు. ఐతే జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో పార్టీకి సొంత విమానం అవసరమనే ఆలోచనకు సీఎం కేసీఆర్ వచ్చారట. 2001లో టీఆర్ఎస్‌ని ప్రారంభించిన తర్వాత వివిధ పర్యటనల కోసం హెలికాకాప్టర్‌ను వినియోగించడం పార్టీ బలోపేతానికి దోహదం చేసిందని, దాని ద్వారా గుర్తింపు లభించిందని గులాబీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారట. ఇప్పుడు సొంత విమానంలో పర్యటించడం వల్ల జాతీయస్థాయిలోనూ అంతే గుర్తింపు వస్తుందని భావిస్తున్నారట.

  కాగా, అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. జాతీయ పార్టీ విషయంలో కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (BRS) లేదా భారతీయ రైతు సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Telangana, Trs

  ఉత్తమ కథలు