హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: తగ్గేదే లేదు.. సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. దీనికి సంకేతమేంటి?

CM KCR: తగ్గేదే లేదు.. సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. దీనికి సంకేతమేంటి?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

CM KCR: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల తరపున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయించారు.

  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR).. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా కొన్ని రోజులుగా రాజకీయాలు చేస్తున్న ఆయన.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాత్రం తనదైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఏకమవుతుంటే.. కేసీఆర్ మాత్రం దూరం జరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మమతా బెనర్జీ (Mamata Banerjee) సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కారాదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరపున కూడా ఎవరినీ పంపడం లేదు.

  ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ కాల్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో (President Elections) విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని ఆహ్వానం పంపారు. ఐతే ఆ సమావేశానికి కాంగ్రెస్‌కు కూడా ఆహ్వానించారు మమత బెనర్జీ. ఇదే సీఎం కేసీఆర్‌కు నచ్చడం లేదు. కాంగ్రెస పార్టీని ఆహ్వానించవద్దని మమతను కోరినా.. ఫలితం లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ సమావేశానికి వెళ్లవొద్దని నిర్ణయించారు.

  KTR: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. టీఆర్ఎస్‌ అసంతృప్తి నేతల్లో కొత్త ఆశలు.. గతానికి భిన్నంగా..

  మంగళవారం ప్రగతిభవన్‌ (Pragathi Bhawan)లో పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలో విపక్షాల భేటీకి హాజరు కావాలా, వద్దా అనే అంశంపై వారితో విస్తృతంగా చర్చించారు. అనంతరం.. ఆ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించారు. అందుకు నాలుగు ప్రధాన కారణాలను కేసీఆర్ చూపించినట్లు తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ సమదూరం పాటించడం, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేయడం, హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కవడం, మమతా బెనర్జీ సమావేశం నిర్వహిస్తున్న తీరు సరిగా లేకపోవడం.. ఈ కారణాల వల్లే సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ నేతలతో చెప్పారు.

  KCR| Congress: కాంగ్రెస్ భవిష్యత్తుపై కేసీఆర్ అంచనా.. మాజీ ఎంపీ మాటలతో తేలిపోయిందా ?

  ఒకవేళ కాంగ్రెస్ పాల్గొనే విపక్ష సమావేశానికి హాజరైతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికే ప్రధాన ఎజెండా అయినప్పటికీ... తెలంగాణలో తమకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ హాజరయ్యే సమావేశానికి వెళ్లడం వల్ల.. పార్టీతో కలిసి పనిచేస్తున్నామన్న భావన ప్రజల్లో వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారట. అంతేకాదు బీజేపీ దీనిని అస్త్రంగా తీసుకొని మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని నేతలు చెప్పారట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ విషయంలో.. ఏ మాత్రం తగ్గేది లేదన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మమతా బెనర్జీ సమావేశానికి వెళ్లకపోయినప్పటికీ.. వారు ఖరారు చేసిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గామారింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Mamata Banerjee, Telangana Politics, Trinamool congress

  ఉత్తమ కథలు