తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గర్భిణుల్లో (Pregnant) పౌష్టికలోపాల్ని తగ్గించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ (KCR Nutrition Kit)ను అందుబాటులో కి తీసుకురానుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరాలు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకు ని బతుకమ్మ కానుకగా (Bathukamma Gift) ఈ కిట్‌లను లబ్ధిదా రులకు అందిస్తున్నట్లు తెలిపారు.
సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు..
కేసీఆర్ కిట్ (KCR Kit) లాగానే రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) ఈ పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలుకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. తొలుత 1.5లక్షల మందికి ఈ కిట్‌లు అందజేస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హరీశ్ తెలిపారు.
ఏం ఉండనున్నాయి?
పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్ మిక్స్ పౌడర్ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక అల్బెండజోల్ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్ ఇవ్వాలా లేక కేసీఆర్ కిట్ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్‌ను కూడా తెప్పించి పరిశీలించారు. కాగా, కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఒక్కో కిట్ ధర రూ.2 వేల వరకు ఉంటుందని మంత్రి హరీశ్ తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్‌లు ఇస్తామని, గర్భం దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెల్లకోసారి ఈ కిట్ లబ్ధిదారుకు అందుతుందన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో మందులను మూడు నెలల ముందస్తు కోటాగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు.ఇందులో భాగంగా ఈ–ఔషధీ, వైద్య పరిక రాల నిర్వహణకు ఈ–ఉపకరణ్ పోర్టళ్లను మంత్రి ఆవిష్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bathukamma, CM KCR, KCR Return Gift, Pregnant women