CM KCR DAUGHTER MLC KAVITA WARMLY WISHES MINISTER HARISH RAO A HAPPY BIRTHDAY IN A TWEET PRV
Harish Rao Birthday: నేడు మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు.. ఆప్యాయంగా విషెష్ చెప్పిన KCR కూతురు కవిత.. ఏమన్నారంటే?
హరీశ్‌తో కవిత (ఫైల్)
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు పురస్కరించుకుని కేసీఆర్ కూతరురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హరీశ్‌రావు తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.
గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద కొబ్బరి కాయ కొట్టి తన నడకను ప్రారంభించారు హరీశ్‌రావు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
గురువారం ట్వీట్..
తన పుట్టినరోజైన శుక్రవారంనాడు తాను సిద్దిపేట, హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ముందే నిర్ణయించుకొన్న వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా దూరప్రాంతంలో ఉండాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్నవారిని నిరాశ పరుస్తున్నందుకు మన్నించాలని గురువారం ట్వీట్ చేశారు. అభిమానుల ఆదరాభిమానాలు, ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు.
హెల్పింగ్ చాలెంజ్..
మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం హెల్పింగ్ చాలెంజ్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయాల్సి ఉంటుంది. సహాయం పొందినవారితో సెల్ఫీ దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. ఇదేవిధంగా సహాయం చేయాలని స్నేహితులకు కూడా చాలెంజ్ విసరాల్సి ఉంటుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.