హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eatala Rajender: సమైక్యాంధ్ర వెనక సీఎం కేసీఆర్ కుట్ర.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Eatala Rajender: సమైక్యాంధ్ర వెనక సీఎం కేసీఆర్ కుట్ర.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్

Eatala Rajender: వైసీపీ నేత సజ్జల ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ మోసాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ (TRS) పార్టీ పేరు మారింది. బీఆర్ఎస్‌(BRS)గా అవతరించింది. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని భారత  రాష్ట్ర సమితిగా మార్చుతూ ఆ పార్టీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేఖను పంపింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eeatala Rajender)  స్పందించారు. టీఆర్ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారినందున.. తెలంగాణ (Telangana) ప్రజలతో కేసీఆర్ (CM KCR) బంధం తెగిపోయిందని ఆయన సెటైర్లు వేశారు.  రాష్ట్రాన్నిచక్కదిద్దే సత్తాలేదు గానీ.. దేశాన్ని ఉద్దరిస్తాడట.. అని ఎద్దేవా చేశారు. అంతేకాదు వైసీపీ నేత సజ్జల ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ మోసాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు ఈటల. నల్గొండ జిల్లాలో ప్రజాగోస - బీజేపీ భరోసాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

''తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తానని అంటున్నాడు. టీఆర్ఎస్ పేరు నుంచి తెలంగాణ పదాన్ని రద్దుచేసుకొని.. బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ఇక నుంచి తెలంగాణ ప్రజలతో కేసీఆర్ బంధం తెగిపోయింది. సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకే ఉందని గుజరాత్ ఎన్నికలు నిరూపించాయి. తెలంగాణలోనూ కాషాయ జెండానే ఎగురుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డితో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు.'' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవల సమైక్యాంధ్రపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విభజన చట్టంపై సుప్రీంకోర్టులో ఉన్న ఓ కేసు విషయమై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏపీ, తెలంగాణ కలిసి మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడితే.. మొదట స్వాగతించేది వైసీపీనే అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను తాము బలంగా వ్యతిరేకించామని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని.. లేదంటే సరిదిద్దాలని తాము గట్టిగా కోరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణ కలిసి ఉండాలన్నదే తమ విధానమని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అంతకన్నా ఏం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఐతే సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్న ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వంటి వారు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీతో మళ్లీ కలిసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ఈ అంశంపై తాజాగా స్పందించిన ఈటల రాజేందర్.. సజ్జల కామెంట్స్ వెనక సీఎం కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని.. కానీ ప్రజలు తిప్పికొడతారని విమర్శలు గుప్పించారు.

First published:

Tags: CM KCR, Eatala rajender, Hyderabad, Telangana

ఉత్తమ కథలు