Home /News /telangana /

CM KCR CONDOLENCES TO TELANGANA WARRIOR AND CPM LEADER MALLU SWARAJYAM DEATH MKS

CM KCR: పీడిత ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి మ‌ల్లు స్వ‌రాజ్యం: సీఎం కేసీఆర్ నివాళి.. నల్గొండలో ఆదివారం అంత్యక్రియలు

మల్లు స్వరాజ్యం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మల్లు స్వరాజ్యం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సీఎం అన్నారు.

తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకం అని సీఎం కేసీఆర్ తెలిపారు. పీడిత ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి మ‌ల్లు స్వ‌రాజ్యం అని పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Mallu Swarajyam: తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత.. 16 ఏళ్ల వయసులోనే తుపాకి పట్టి..


కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ల్లు స్వ‌రాజ్యం.. హైద‌రాబాద్‌లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మ‌ల్లు స్వ‌రాజ్యం మృతిప‌ట్ల సీపీఎం న‌ల్ల‌గొండ జిల్లా క‌మిటీ సంతాపం ప్ర‌క‌టించింది. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపింది. మ‌ల్లు స్వ‌రాజ్యం అంత్య‌క్రియ‌లు ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో జ‌రుగుతాయ‌ని సీపీఎం న‌ల్ల‌గొండ జిల్లా కార్య‌ద‌ర్శి ముదిరెడ్డి సుధాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు. మ‌ల్లు స్వ‌రాజ్యానికి ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, CPM, Nalgonda, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు