హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలన రహస్యాలు చెప్పిన కేసీఆర్.. ప్యాకేజీ రూ. 3వేల కోట్లు!

CM KCR | Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలన రహస్యాలు చెప్పిన కేసీఆర్.. ప్యాకేజీ రూ. 3వేల కోట్లు!

ప్రశాంత్ కిషోర్ పై కేసీఆర్ ఆసక్తికర కామెంట్లు

ప్రశాంత్ కిషోర్ పై కేసీఆర్ ఆసక్తికర కామెంట్లు

మరీ రూ.300 కోట్లు అంటే ప్రశాంత్ కిషోర్ పరువు తీసినట్లవుతుందేమో. కనీసం రూ.3000 కోట్లు ఇచ్చామని చెప్పినా ఆయన గౌరవాన్ని నిలబెట్టినట్లు అవుతుందని కేసీఆర్ సంచలన రీతిలో సమాధానం చెప్పారు.

దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ ను ప్రస్తుతం తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసుకుంది. కొద్ది రోజుల కిందట నేరుగా తెలంగాణలో పర్యటించి, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ను కలిసి, కీలక రిపోర్టులు అందజేశారాయన. పీకే సేవలను టీఆర్ఎస్ వాడుకుంటోన్న విషయాన్ని కేసీఆర్ ఇవాళ మరోసారి బాహాటంగా అంగీకరించారు. అంతేకాదు, ఎన్నికల వ్యూహరచన చేస్తున్నందుకు పీకేకు ముట్టచెప్పే డబ్బుల లెక్కలపైనా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. సీఎం వ్యాఖ్యలతో ప్రశాంత్ కిషోర్ గురించి ఇప్పటిదాకా దేశానికి తెలియని రహస్యాలు వెల్లడైనట్లయింది. కేంద్రంపై వరి పోరును ఉధృతం చేస్తూ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడానికి సోమవారం ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్.. ముందస్తు ఎన్నికలు, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారిలా..

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి ఇంటికి పంపేయడానికే తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించానని, పదునైన వ్యూహరచన కోసం తానే ప్రశాంత్ కిషోర్ ను పిలిపించుకున్నానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిజానికి పీకేతో ఎనిమిదేళ్లుగా మంచి స్నేహం ఉందని రివీల్ చేశారు కేసీఆర్. ఐక్యరాజ్యసమితితోపాటు పలు దేశాల్లో పనిచేసిన అనుభవం ప్రశాంత్ కిషోర్ కు ఉందని, దేశం పట్ల అతని కమిట్మెంట్ గొప్పదని, అద్భుతమైన సర్వేలు చేసే గొప్ప కళ పీకే సొంతమని కేసీఆర్ కొనియాడారు. కాగా, ‘టీఆర్ఎస్.. పీకేతో రూ.300 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నిజమేనా?’అని ఓ విలేకరి ప్రశ్నించగా..

Telangana: ఆ బియ్యం పక్కాగా కొంటాం: గోయల్ | అలా చేస్తే దండేసి దండం పెడతా: కేసీఆర్


‘మరీ రూ.300 కోట్లు అంటే ప్రశాంత్ కిషోర్ పరువు తీసినట్లవుతుందేమో. కనీసం రూ.3000 కోట్లు ఇచ్చామని చెప్పినా ఆయన గౌరవాన్ని నిలబెట్టినట్లు అవుతుంది’ అని కేసీఆర్ సంచలన రీతిలో సమాధానం చెప్పారు. అసలు ఎన్నికల వ్యూహాలకు పీకే డబ్బులే తీసుకోరని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంత వ‌ర‌కూ ప్ర‌శాంత్ కిశోర్ ఎవ‌రి ద‌గ్గ‌రా రూపాయి కూడా ఫీజు తీసుకోలేద‌ని.. ఆయ‌న డ‌బ్బుల కోసం ప‌ని చేయ‌రంటూ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. ఎవ‌రైనా ఆయ‌న సాయం కోరితే.. ఉచితంగా వారి కోసం వ‌ర్క్ చేస్తార‌ని.. అంతేగాని ఇన్నికోట్లు, అన్నికోట్లు అనేదంతా అవాస్త‌వ‌మ‌ని.. పీకే చాలా మంచి మ‌నిషంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. బాజాప్తగానే పీకే ఐప్యాక్ సంస్థను పెట్టుకున్నాడని, ఏ పనినీ రహస్యంగా చేయబోడనీ కేసీఆర్ అన్నారు.


CM KCR | Etela Rajender: సీఎం కేసీఆర్ భారీ సర్‌ప్రైజ్.. ఈటల రాజేందర్‌కు లేఖ.. బీజేపీపై యుద్దం వేళ!


‘జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నా. నా ఆహ్వానం మేరకు ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చి పని చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఎనిమిదేళ్లుగా నాకు మంచి స్నేహితుడు. ఆయన ఎప్పుడూ డబ్బులు తీసుకొని పని చేయరు. దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత ఏమిటో మీకు తెలియదు. ఆయన డబ్బులు తీసుకొని పనిచేస్తారని ఎవరైనా నిరూపిస్తారా?పార్టీల అవసరాల మేరకు 12 రాష్ట్రాల్లో పనిచేశారు. తమిళనాడు, ఏపీ, బెంగాల్ తో పాటు బీజేపీకికు కూడా ప్రశాంత్‌ పనిచేశారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్‌ కిశోర్‌కు అవగాహన ఉంది’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  పీకేపై కేసీఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.  పీకే డబ్బు తీసుకోకుండా పనిచేస్తారన్న కేసీఆర్ కితాబుపై భిన్న కామెంట్లు వస్తున్నాయి.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Prashant kishor, Telangana, Trs

ఉత్తమ కథలు