హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | PM Modi: రేపు భూకంపం! -హైదరాబాద్‌కు కేసీఆర్ -కేబినెట్ భేటీలో యుద్ధభేరి 2.0?

CM KCR | PM Modi: రేపు భూకంపం! -హైదరాబాద్‌కు కేసీఆర్ -కేబినెట్ భేటీలో యుద్ధభేరి 2.0?

హైదరాబాద్ కు కేసీఆర్, రేపు కేబినెట్ బేటీ

హైదరాబాద్ కు కేసీఆర్, రేపు కేబినెట్ బేటీ

మోదీ సర్కారుకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ రేపటితో పూర్తికానుండటంతో మంగళవారం కేబినెట్ మీటింగ్ జరిపి, ఆపై బీజేపీపై యుద్దభేరికి కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) 8 రోజుల సుదీర్ఘ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరారు. వరి పోరులో భాగంగా కేంద్రం తీరును ఎండగడుతూ ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్ష (TRS Deeksha At Delhi) విజయవంతమైన తర్వాత కేసీఆర్ సొంత రాష్ట్రానికి పయనమయ్యారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ నిర్వహించిన ధర్నాలో పలు సంచలన ప్రకటనలు చేసిన కేసీఆర్.. హైదరాబాద్ చేరుకోకముందే మంత్రిమండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. మోదీ సర్కారుకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ రేపటితో పూర్తికానుండటంతో మంగళవారం కేబినెట్ మీటింగ్ జరిపి, ఆపై బీజేపీపై యుద్దభేరికి కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది..

ఢిల్లీలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు ఇరత రాజకీయ పార్టీల నేతలెవరూ హాజరుకాలేదు. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ ఒక్కరే దీక్షా స్థలికి వచ్చి కేసీఆర్ కు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందేన‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. ఇప్పుడున్న కేంద్రానికి ఎందుకింత అహంకారం? అని నిలదీశారు.

CM KCR : కేసీఆర్ సంచలనం.. మోదీ సర్కారుకు 24గం. డెడ్‌లైన్.. జైలుకు పంపే దమ్ముందా?


మోదీ సర్కార్ కార్పొరేట్ల‌కు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌తో దాడులు చేస్తారు. బీజేపీలో అంద‌రూ స‌త్య‌హ‌రిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల ద‌గ్గ‌ర‌కు ఈడీ, సీబీఐ వెళ్ల‌దు.. ప్ర‌తి రాష్ట్రంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు అంటున్నారు. ద‌మ్ముంటే రావాల‌ని కేసీఆర్ స‌వాల్ విసిరారు. ఊరికే మొర‌గ‌డం స‌రికాద‌నీ బీజేపీని పంచ్ విసిరారు. ఢిల్లీ దీక్ష విజయవంతమైన తర్వాత హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ మంగళవారం నాడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

AP New Cabinet: జగన్ జగమొండి ఇక పాతమాట? -కొత్త కేబినెట్ కూర్పులో బీజేపీ, కుటుంబ ఒత్తిళ్లు?


ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని సీఎం తేల్చిచెప్పారు. కేసీఆర్ డెడ్ లైన్ పై కేంద్రం రియాక్షన్ ఇవ్వకపోవడాన్ని బట్టి లైట్ తీసుకొని ఉంటారా? అనే భావన వ్యక్తమవుతోంది. అయితే, కేసీఆర్ మాత్రం ధాన్యం విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని ముందే చెప్పిన క్రమంలో రేపు భూకంపం లాంటి ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది. గత వారం రోజులుగా టీఆర్ఎస్ దశల్లో వరిపోరు నిర్వహించగా, రేపటి కేబినెట్ భేటీలో యుద్ద భేరి 2.0ను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

Vidadala Rajini: చంద్రబాబు నాటిన మొక్క.. జగన్ కేబినెట్‌లో మంత్రి అయింది.. విడదల రజని ప్రస్థానం


హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో మంగళవారం(ఏప్రిల్ 12) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తెలంగాణ మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కేబినెట్ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌రు కానున్నారు. కేబినెట్ స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. కేబినెట్ భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై యుద్ధ భేరి మోగించే అవకాశాలున్నాయి. అలాగే, గత 8 రోజులుగా ఢిల్లీలో ఏం చేసింది, ఎవరెవరిని కలిసింది, చికిత్స తదితర విషయాలను కూడా కేసీఆర్ వెల్లడిస్తారని సమాచారం.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Delhi, Dharna, Paddy, Telangana, Trs

ఉత్తమ కథలు