హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : 16 రోజుల తర్వాత ప్రగతి భవన్‌కు కేసీఆర్.. రేపు పీకేతో భేటీ -రాజ్యసభకు పంపేది వీరినేనా!

CM KCR : 16 రోజుల తర్వాత ప్రగతి భవన్‌కు కేసీఆర్.. రేపు పీకేతో భేటీ -రాజ్యసభకు పంపేది వీరినేనా!

కేసీఆర్, పీకే

కేసీఆర్, పీకే

16 రోజులపాటు ఫామ్ హౌజ్ కే పరిమితమై అధికారిక, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ మళ్లీ కొద్ది గంటల కిందటే రీయాక్టివేట్ అయి ప్రగతి భవన్ వచ్చారు. రేపటి నుంచి ఆయన షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండనుంది. కీలక నిర్ణయాలెన్నో వెలువడనున్నాయి..

ఇంకా చదవండి ...

రెండు వారాల వ్యవధిలో బీజేపీ టాప్ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా తెలంగాణలో భారీ బహిరంగ సభలు పెట్టి టీఆర్ఎస్ సర్కారును చెడామడా తిట్టి వెళ్లారు.. కాంగ్రెస్ సైతం రాహుల్ గాంధీతో వరంగల్ డిక్లరేషన్ ఇప్పించి టీఆర్ఎస్ కంటే మెరుగైన వ్యవసాయ విధానాన్ని అందిస్తామని మాటిచ్చింది.. ఈ రెండు పార్టీలకు అధికార టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్లు ఇచ్చారే తప్పా పెద్దాయన సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇప్పటిదాకా నోరుమెదలేదు. మరోవైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యూహం ఖరారు పెండింగ్ లో ఉన్నాయి. రెండు వారాలకుపైగా అధికారిక, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కొద్ది గంటల కిందటే రీయాక్టివేట్ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్ వచ్చారు..

సీఎం కేసీఆర్ గత నెల (ఏప్రిల్) 29న చివరిసారిగా సర్కారువారి ఇఫ్తార్ విందులో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. 30న ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు. మధ్యలో రంజాన్, మేడే శుభాకాంక్షలు, టీడీపీ బొజ్జల గోపాలకృష్ణ మృతిపై సీఎంవో నుంచి అధకారిక ప్రకటనలే తప్ప 16 రోజులపాటు ఆయన ఫామ్ హౌజ్ లోనే ఉంటూ ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొనలేదు. పార్టీ సమావేశాలను నిర్వహించలేదు. వరిపోరు 2.0లో భాగంగా కేసీఆర్ ఢిల్లీ వెళతారని వార్తలు వచ్చినా అలాంటిదేమీ జరగలేదు. సుదీర్ఘ విరామం అంటే, 16 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ సోమవారం నాడు(16న) ప్రగతి భవన్ తిరిగొచ్చారు. బుధవారం (మే 18) నుంచి ఆయనకు ఊపిరిసలపనంత బిజీ షెడ్యూల్ ఉంది..

CM KCR స్వయంగా రావాల్సిందే -నాపై రాళ్లు వేస్తే రక్తంతో చరిత్ర రాస్తా: Governor Tamilisai

రెండు వారాల పాటు పెండింగ్ లో ఫైళ్లను క్లియర్ చేయడంతోపాటు రేపు (18న) ప్రగతి భవన్‌లో పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే రైతుల కోసం కొత్త గా వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించే అంశాన్ని కూడా సీఎం పరిశీలించనున్నారు. బుధవారం నాడే టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంద్ కిషోర్ తోనూ కేసీఆర్ భేటీ కానున్నారు. కాంగ్రెస్ లో చేరిక ఆలోచనను విరమించుకోడానికి ముందు హైదరాబాద్ వచ్చి, ప్రగతి భవన్ లోనే రెండు రోజులు బస చేసిన పీకే ఆపై ఢిల్లీ వెళ్లి తాను కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటన చేయడం తెలిసిందే. సొంత పార్టీ ఏర్పాటు దిశగా ‘జన్ సురాజ్’ వేదికను ఏర్పాటు చేసి, పాదయాత్ర తేదీలను కూడా ప్రకటించిన తర్వాత పీకే పాల్గొనబోయే తొలి వ్యూహాత్మక భేటీ కేసీఆర్ తోనే కావడం గమనార్హం. ఎమ్మెల్యేలపై సర్వే రిపోర్టులు, రాజ్యసభ ఎన్నికలపై కేసీఆర్-పీకే మాట్లాడుకుంటారని సమాచారం. మరోవైపు

PM Kisan | Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. 2.28లక్షల పేర్లు తొలగింపు.. నెలాఖరున రూ.2వేలూ లేనట్టే!


సీఎం కేసీఆర్‌ ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్రంలోని మూడు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 19తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ దృష్ట్యా అభ్యర్థిని ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు సీట్లకు కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 19 కాగా, వచ్చే నెల 21న రాజ్యసభ సభ్యులుగా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు మే 31 (నామినేషన్లకు)చివరి. అయితే మూడు పేర్లను కేసీఆర్ ఒకేసారి వెల్లడిస్తారని తెలుస్తోంది.

CM KCR | Prashant Kishor : మరోసారి కేసీఆర్‌తో పీకే భేటీ.. బీజేపీకి దిమ్మతిరిగే వ్యూహం ఇదేనా?

టీఆర్ఎస్ మొత్తం ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా అందులో ఒకటి నటుడు ప్ర‌కాష్ రాజ్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. మరో రెండు సీట్లకు పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి, బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, మ‌హ‌బూబాబాద్ మాజీ ఎంపీసీతారాంనాయ‌క్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బండ ఖాళీతో ఏర్పడిన ఎంపీ పోస్టు పదీకాలం ఇంకా రెండు సంవత్సరాలే ఉండటంతో ఆ కోటాలో పెద్దల సభకు వెళ్లేందుకు నేతలు ఆసక్తి చూపడలేదని సమాచారం.

Business Idea: తక్కువ పెట్టుబడితో అద్భుత వ్యాపారం.. నెలనెలా భారీ సంపాదన ఖాయం


ఢిల్లీలో ఆఫీసు నిర్మిస్తోన్న టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోశించేలా పార్టీ జాతీయ వ్యవహరాలను ఇటీవల కవితకు కట్టబెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను రాజ్యసభ ఎంపీగా ఢిల్లీకి పంపినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా 16 రోజుల విరామం తర్వాత తిరిగి రంగంలోకి దిగిన కేసీఆర్.. వీలును బట్టి ఈ వారంలోనే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలకు కౌంటర్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: CM KCR, Prashant kishor, Telangana, Trs

ఉత్తమ కథలు