CM KCR APPOINTS OBSERVERS MAYOR AND CHAIRMAN ELECTION IN TELANGANA VB
Telangana: మేయర్, చైర్మన్ ఎన్నికల పరిశీలకుల నియామకం.. జాబితా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)
Telangana: మినీ మున్సిపల్ పోరు ముగిసింది. అయితే కీలక ఘట్టం అయిన మేయర్, చైర్మన్ పదవులు ఎవరికీ వరిస్తాయో తెలియదు. సీల్డ్ కవర్ ద్వారా వారి పేర్లను ప్రకటించేందుకు ఎన్నికల పరిశీలకులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
రెండు నగరపాలిక, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ టీఆర్ఎస్ దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయిదే ఈ నెల మే 7 న జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ పదవులపై ప్రతీ చోట ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఆ పదవి వరిస్తుందో తెలియని పరిస్థతి . ఈ పదవులకు చాలా చోట్ల టీఆర్ఎస్లో అంతర్గతంగా బహుముఖ పోటీ ఉండటంతో ఏకాభిప్రాయ సాధనతో ఏకగ్రీవ ఎన్నిక జరగాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఖరారు చేశారు. వారు ఎవరు అనేది బహిర్గతం చేయలేదు. అంతేకాకుండా సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితాను కూడా సిద్ధం చేశారు.
వారి ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేందుకు తెలంగాణ సర్కారు వారి వివరలను వెల్లడించేందుకు సీల్డ్ కవర్ లను సిద్ధం చేశారు. ఈ పదవుల ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున పరిశీలకులను నియమించారు. వీరు పార్టీ అధినేత ఇచ్చే సీల్డ్ కవర్లను వెంట తీసుకుని తమకు కేటాయించిన కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ లు పరిశీలకులుగా ఉంటారని.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి నరేశ్ రెడ్డి పరిశీలకులుగా ఉంటారన్నారు.
కొత్తూరు మున్సిపాలిటీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నకిరేకల్ కు ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, సిద్దిపేట మున్సిపాలిటీకి మాజీ మేయర్ రవీందర్ సింగ్ , ప్రతాప్ రెడ్డి లు ఉండగా.. అచ్చంపేట కు మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి , జడ్చర్ల మున్సిపాలిటీకి పౌర సరఫరా కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిశీలకులుగా ఉంటారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.