Home /News /telangana /

CM KCR APPOINTED SOMESH KUMAR AS TELANGANA NEW CS AK

తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్

సోమేశ్ కుమార్(ఫైల్ ఫోటో)

సోమేశ్ కుమార్(ఫైల్ ఫోటో)

తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు.

    తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సోమేశ్ కుమార్... మరికాసేపట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది. నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సోమేశ్ కుమార్... తెలంగాణ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీఎస్‌ రేసులో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌, శాంతికుమారి, అధార్‌సిన్హా ఉన్నారు. వీరిలో అజయ్‌మిశ్రా, సోమేష్‌కుమార్‌ రేసులో ముందుండగా... సోమేశ్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. సోమేష్‌కుమార్‌కు మరో మూడన్నరేళ్ల పాటు సర్వీసు ఉండటం వల్లే సీఎం కేసీఆర్ ఆయనను సీఎస్‌గా నియమించారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం సోమేష్ కుమార్ కంటే అజయ్‌మిశ్రా ముందున్నా... ఆయనకు కేవలం ఆరు నెలల సర్వీసు మాత్రమే ఉండటం మైనస్‌గా మారిందనే ప్రచారం జరుగుతోంది.

    బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఆయన గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ విధులు నిర్వహించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Somesh kumar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు