హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad ByPolls: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్.. సీఎం కేసీఆర్ ప్రకటన

Huzurabad ByPolls: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్.. సీఎం కేసీఆర్ ప్రకటన

సీఎం కేసీఆర్‌తో గెల్లు శ్రీనివాస్

సీఎం కేసీఆర్‌తో గెల్లు శ్రీనివాస్

Gellu Srinivas: గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసిఆర్..హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఇప్పటికే బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈటల రాజేందర్ లేదా ఆయన జమున ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఐతే అధికార పార్టీ అభ్యర్థి ఎవరన్నది కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారుచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టిఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసిఆర్..హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

గెల్లు శ్రీనివాస్ యాదవ్‌‌ది గ్రామీణ నేపథ్యం. ఆయన తండ్రి గెల్లు మల్లయ్య స్థానిక మండల స్థాయి లో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్య గారు అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్ (2000-2005)గా, కొండపాక ఎంపీటీసీ (2001-2005)గా టీఆరెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా పనిచేశారు. టీఆరెస్ పార్టీలో మండల స్థాయిలో 2004 నుండి నేటి వరకు పనిచేస్తున్నారు. జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్, (పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్)గ ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం PACS డైరెక్టర్‌గా మరియు రైతు బంధు సమితి కోఆర్డినేటర్ (కొండపాక)గా పనిచేస్తన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ (టీఆరెస్ పార్టీ)గా సేవలందించారు.

డిగ్రీ (బి.ఏ)చదువుతున్న కాలం నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు గెల్లు శ్రీనివాస్. హైదరాబాద్ లోని అంబర్ పెట్ లోని ప్రభుత్వ బిసి హాస్టల్ లో ఉంటూ అధ్యక్షుడు (2003-2006)గా ఎన్నికై బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. 2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 100కు పైగా కేసులు నమోదయ్యాయి అనేక సార్లు పోలీసులు అరెస్టు చేశారు మరియు 2 సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి సెంట్రల్ జైల్ మరియు చంచల్ గూడ సెంట్రల్ జైల్లో జైలు జీవితం గడిపారు. 2017 నుండి TRS విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరరారవడంతో హుజూరాబాద్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి సీఎం కేసీఆర్ తప్పించడంతో.. ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బైచెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉన్నారు. పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అటు టీఆర్ఎస్ ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లకు గాలం వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ పేరు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయన కూడా త్వరలోనే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Dalita Bandhu: దళితబంధు పథకాలివే.. రూ. 10 లక్షలతో ఏమేమి చేయవచ్చంటే.. పూర్తి వివరాలు..

టీఆర్ఎస్ ఆ నేతపై ఫోకస్ పెట్టిందా ?.. తీన్మార్ మల్లన్న, వైఎస్ షర్మిల కంటే ఎక్కువగా...

First published:

Tags: CM KCR, Gellu Srinivas Yadav, Huzurabad, Huzurabad By-election 2021, Telangana

ఉత్తమ కథలు