• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CM KCR ANNOUNCES FREE RATION TO WHITE RATION CARD HOLDERS FINANCIAL ASSISTANCE ANOTHER 80000 PRIVATE TEACHERS SK

Telangana: రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం.. ప్రైవేట్ టీచర్లకు మరో గుడ్‌న్యూస్

Telangana: రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం.. ప్రైవేట్ టీచర్లకు మరో గుడ్‌న్యూస్

సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

తెలంగాణలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే ఇస్తుండగా.. మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

  • Share this:
    కరోనా కష్టాల వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని నిర్ణయించారు. ఇక ప్రవేట్ టీచర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే ఇస్తుండగా.. మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు లక్ష 20వేల మందితో పాటుమరో 80వేల టీచర్ల కూడా నెలకు రూ.2,000, 25 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. మొత్తంగా 2 లక్షల మంది ప్రైవేట్ టీచర్లకు ఈ కరోనా కష్ట కాలంలో లబ్ధి చేకూరనుంది.

    ఇక కరోనా కట్టడిపై ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసిఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కలిక పద్దతిన పని చేసేందుకు మొత్తం 50వేల మందిని ఉద్యోగాల్లో నియమించాలని నిర్ణయించారు. తాత్కాలిక వైద్యులతోపాటు పారమెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్స్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని మూడు నెలల పాటు ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ధరఖాస్తులు ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. మూడు నెలలకు కోసం నియమించుకుంటున్న వారికి భవిష్యత్ ఉద్యోగాల్లో వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు.


    తెలంగాణలో ఆదివారం 4976 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 7646 మంది కోలుకోగా.. మరో 35 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా నుంచి 4,28,865 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 2739 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 65,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 55,358 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,36,13,004 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పెట్టినప్పటికీ.. తెలంగాణలో మాత్రం లాక్‌డౌన్ పెట్టబోమని సీఎం కేసీఆర్ ఇది వరకే చెప్పారు. లాక్‌డౌన్ వల్ల సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయి.. ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ వల్లే కరోనాను కట్టడి చేయగలమని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు