Home /News /telangana /

CM KCR ANNOUNCES 91142 JOBS NOTIFICATION FOR 80039 JOBS RS7000CR PER ANNUM BURDEN ON TREASURY MKS

CM KCR: జాతీయ రికార్డు బద్దలు! -కొత్తగా 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు -ఖజానాపై భారం ఎంతో తెలుసా?

అసెంబ్లీలో కేసీఆర్

అసెంబ్లీలో కేసీఆర్

ముందస్తు ఎన్నికల ఊహాగానాలను మరింత బలపరుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మొత్తం 91,142 ఉద్యోగాల భర్తీ, ఒకేరోజు 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ఖజానాపై భారం ఎంతంటే..

ముందస్తు ఎన్నికల ఊహాగానాలను మరింత బలపరుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. 80,039 పోస్టుల భ‌ర్తీకి ఇవాళే నోటిఫికేష‌న్లు వెలువ‌డుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రకటన నిరుద్యోగులను గుబాళింపచేసిందని గులాబీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, ఒకేరోజు 80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ జాతీయ రికార్డును సైతం బద్దలుకొట్టినట్లు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ సీఎం చెప్పినట్లు వాస్తవంగా అన్ని నోటిఫికేష్లు ఒకేరోజు రాబోవు. అయితే కొత్త కొలువుల వల్ల ప్రభుత్వ ఖజానాపై అసాధారణరీతిలో భారతం పడనుంది. పూర్తి వివరాలివే..

తెలంగాణలో జోన్ల విభజన కొలిక్కి వచ్చిన దరిమిలా 33 జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను ఆయా జోన్లవారీగా భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో మాట్లాడిన సీఎం ఈ మేరకు సంచలన ప్రకటించారు. ఒకే రోజు 80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం చెప్పగానే సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా బల్లలు చరుస్తూ ‘జై కేసీఆర్..’ అని నినాదాలు చేశారు. కానీ, సీఎం ప్రకటన ముగిసిన తర్వాత, ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

CM KCRకు భిన్నంగా మంత్రి KTR -విరోధులతోనూ ఆత్మీయ ఆలింగనం -ఈటల ముఖం చూడొద్దనే సస్పెన్షన్?


వివిధ శాఖలతోపాటు తెలంగాణ ప‌రిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేస్తామని, మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని, అందులో ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు. కాగా, కొత్త కొలువుల వల్ల..

రైతులకు శుభవార్త : ఆ రుణాలన్నీ మాఫీ -రూ. 16,144 కోట్ల భారం తగ్గినట్లే -సాగుకు భారీగా నిధులు


కేసీఆర్ సర్కారు తాజా నిర్ణయం ప్రకారం.. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. స్వల్ప వ్యవదిలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై అనూహ్య భారం పడనుంది. ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. భారమని తెలిసినా సరే నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యోగ నియామకాల ప్రకటనను వెలువరిస్తున్నందుకు సంతోషంగా ఉందని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రకటన పూర్తయిన క్రమంలో నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. కాగా,

Gold Loan Waiver: బంగారు నగల రుణమాఫీ.. భారీ కుంభకోణం? -సీఎం కీలక నిర్ణయం

తెలంగాణలో గడిచిన 7ఏళ్లలో కేసీఆర్ సర్కారు చేపట్టిన నియామకాల సంఖ్య సుమారు 1.3లక్షలుకాగా, గత మూడేళ్లుగా నోటిఫికేషన్లు దాదాపుగా లేకుండాపోయాయి. ఇప్పుడు ఒకేసారి దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తి చేస్తుండటం వెనుక కేసీఆర్ రాజకీయ చతురత ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకోసమే గత మూడు నెలలుగా వరుగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, ఇప్పుడు మెగా నోటిఫికేషన్లనూ ప్రకటించారని తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Job notification, Telangana, Telangana Assembly, Telangana Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు