Home /News /telangana /

CM KCR ANNOUNCED THAT THE ORPHANS WILL BE PROVIDED COMPLETE EDUCATION AND RESERVATION IN JOBS WILL BE GIVEN PRV

CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగ నియామకాల్లో కొత్త రిజర్వేషన్లు!

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని సీఎం కేసీఆర్​ శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో స్పష్టంచేశారు. ఈ మేరకు సీఎం ఓ కీలక నిర్ణయం తీసకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా గుర్రుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)..  మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు శనివారం జరిగిన ప్రెస్​మీట్​లో తెలిపారు సీఎం కేసీఆర్. భారత బ్యాంకుల నుంచి లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకొని విదేశాలకు పారిపోతున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగారు. ఇలా ఒకపక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ.. పేద ప్రజలకు ఇచ్చే ఉచితాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కార్పొరేట్ దొంగలకు ఇలా లోన్లు ఇవ్వడం ఉచితాలు కాదా? అని అడిగారు కేసీఆర్​.

    అనాథలపై ఫోకస్​..

    రాష్ట్రంలోని అనాథ పిల్లలంతా (Orphans) ఇకపై సర్కారు బిడ్డలు(స్టేట్‌ చిల్డ్రన్స్‌) అని సీఎం కేసీఆర్ (CM KCR)​ ప్రకటించారు. విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని ప్రెస్‌మీట్‌లో స్పష్టంచేశారు. ‘రాజ్యాంగంలో మొదటి పేరాలోనే ఇండియా షల్‌ బీ ఏ వెల్ఫేర్‌ స్టేట్‌ అని ఉంటది. భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం అని రాజ్యాంగ స్ఫూర్తిలోనే ఉన్నది. దాన్ని అనుసరించి సంక్షేమరాజ్యంగా ఉండే ఇండియాలో బాధితులు, దుఃఖితులు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నం. అనాథ పిల్లలను స్టేట్‌చిల్డ్రన్‌గా డిక్లేర్‌ చేయాలని చెప్పాం”అని సీఎం కేసీఆర్​ అన్నారు.



    క్యాబినెట్‌ సబ్‌కమిటీ రికమెండేషన్స్‌ కూడా ఇచ్చిందని కేసీఆర్ (CM KCR)​ తెలిపారు. 8న హైటెక్స్‌లో జరిగే సభలో ఆ వివరాలు వెల్లడిస్తానని ఆయన అన్నారు. అనాథ పిల్లలను స్టేట్‌చిల్డ్రన్‌గా డిక్లేర్‌ చేయడంతో పాటు అనాథ శరణాలయాలను (Orphanages) పూర్తిగా ఆదుకొని, వారికోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. వారిని చదివించి, ఉద్యోగాల్లో కూడా కొంచెం రిజర్వేషన్‌ ఇవ్వాలని, గ్రాంట్‌ పెంచాలని నిర్ణయించాం అని అన్నారు. దీంతో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ (reservations) ప్రక్రియ కొంచెం మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లలో విభజించి ఇస్తారా? లేదా కొత్తగా యాడ్​ చేస్తారా? అనేద తర్వాత నిర్ణయించనుంది ప్రభుత్వం.

    ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం..

    డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా ఫించన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్  (CM KCR) తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే.. వాళ్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని వివరించారు.

    అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిఫారసు మేరకు డయాలసిస్ పేషెంట్లకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వాళ్లకు బస్ పాసులు ఇస్తున్నామని, ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, ఇటీవల డయాలసిస్ కేంద్రాలు కూడా పెంచామని తెలియజేశారు. రాష్ట్రంలో 10-12 వేల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లకు ఇప్పటి వరకు ఇస్తున్న సేవలతో కలిపి కొత్తగా ‘ఆసరా’ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, JOBS, Orphaned girl, Reserve Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు