రైతులకు కొత్త శుభవార్త చెప్పనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రైతాంగానికి త్వరలోనే తాను మరో తీపికబురు చెప్పబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

news18-telugu
Updated: May 29, 2020, 2:37 PM IST
రైతులకు కొత్త శుభవార్త చెప్పనున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే తాను మరో తీపికబురు చెప్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గజ్వేల్ నియోజవకర్గంలోని కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి నీటిని విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం... త్వరలోనే తాను రైతులకు మరో శుభవార్త చెప్పబోతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైనాన్స్ అంశాలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా పద్ధతిని అమలు చేయబోతున్నట్టు వివరించారు. తాను కొత్తగా చెప్పబోయే తీపికబురు విని దేశమంతా మరోసారి ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. త్వరలోనే అదేమిటో తాను చెబుతానని... అప్పటివరకు అంతా వేచి చూడాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని అన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. భూ నిర్వాసితుల త్యాగాలు గుర్తు చేసుకోకుండా ఉండలేమని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అతి పెద్దదని... మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు కానుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 165 టీఎంసీల కెపాసిటీతో కొత్త రిజర్వాయర్‌లు నిర్మించామని... ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదని అన్నారు. మూడు నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామని... లక్ష కోట్ల రూపాయాల పంటను తెలంగాణ రైతాంగం సంవత్సరానికి పండించబోతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
First published: May 29, 2020, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading