హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : రైతు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ పరిహారం , ప్రకటించిన సీఎం కేసిఆర్

CM KCR : రైతు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ పరిహారం , ప్రకటించిన సీఎం కేసిఆర్

దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టించడానికి కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టగానే కేంద్రం వణికిపోయి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందంటూ టీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుండగా, కేసీఆర్ కమిషన్ల వల్లే తెలంగాణలో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని కమలదళం కౌంటిర్ ఇస్తున్నది.

దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టించడానికి కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టగానే కేంద్రం వణికిపోయి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందంటూ టీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుండగా, కేసీఆర్ కమిషన్ల వల్లే తెలంగాణలో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని కమలదళం కౌంటిర్ ఇస్తున్నది.

CM KCR : రైతు చట్టాల వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.ఇక కేంద్రం కూడా 25 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని సీఎం కేసిఆర్ డిమాండ్ చేశారు.

రైతు చట్టాల వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక చట్టాల రద్దుతో పాటు రైతులకు క్షమాపణ చేప్పిన ప్రధాని మోదీ వెంటనే రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతులకు సంఘీబావం తెలుపుతున్నట్టు సీఎం ప్రకటించారు. కేవలం చట్టాలను రద్దు చేయడమే కాకుండా రైతులపై పెట్టిన కేసులను కూడా వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోరాటంలో బాగంగా రైతులతోపాటు ఇతరుపై కూడా కేసులు పెట్టారని, అవి కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పంటలకు ఎమ్‌ఎస్‌పీ ప్రకటించే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వెంటనే కేంద్రం స్పందించి పరిష్కరించాలని కోరారు. వ్యవసాయం చట్టాల రద్దు తర్వాత విద్యుత్ చట్టాలు కూడా వివాదస్పదంగా ఉన్నాయని వాటిని కూడా కేంద్రం పరిష్కరించి చట్టం చేయకుండా ఉండాలని అన్నారు. ఒకవేళ చట్టం చేసిన రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఉండవద్దని ఆయన సూచించారు. వారికి ఇష్టం ఉంటే బీజేపి అధికారంలో ఉన్న రాష్ట్రల్లో అమలు పరుచుకోవాలని సూచించారు.

నీటి వాటాపై ట్రిబ్యునల్.. వెంటనే తేల్చండి

రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదలపై కూడా కేంద్రం వెంటనే స్పందించి ట్రిబ్యునల్ వేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అది కూడా ఒక సమయంలో పరిష్కరించే విధంగా టైంబౌండ్ పెట్టాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కారం అయితే ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఇందుకోసం తనతోపాటు మంత్రులు రెండు రోజుల పాటు ఢిల్లీకి వెళతామని చెప్పారు.

ఇది చదవండి  : ఆయన కలెక్టరే అయినా.. పిల్లలు మాత్రం అంగన్‌వాడి స్కూళ్లో..


బీసీ గణన

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పలు కులాలకు రిజర్వేషన్ కల్పించేందుకు సిద్దంగా ఉందని అయితే ఇందుకోసం కేంద్రం కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా గణన ఉన్నప్పుడు బీసీ గణన చేయడం వల్ల నష్టం లేదని అన్నారు. దేశం కులాలతో ముడిపడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వాల ఆయా కులాలకు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నామని అన్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలకు కనీసం సిగ్గుండాలని మరోసారి మండిపడ్డారు. ఓ వైపు రైతు చట్టాలను రద్దు చేస్తూ క్షమాపణలు చెబుతుంటే రాష్ట్ర నేతలు ఇంకా రెచ్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీజేపీ నిజంగా రైతు చట్టాల రద్దు చేయడం కేవలం ఎన్నికల కోసమేనని దేశం నమ్ముతుందని అన్నారు.

First published:

Tags: CM KCR, Farm Laws

ఉత్తమ కథలు