కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు మధ్య కేంద్రం జోక్యం ?

ఒకే అంశంపై అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుండటంతో... ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: November 27, 2019, 4:27 PM IST
కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు మధ్య కేంద్రం జోక్యం ?
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాము సమ్మె విరమించినా... ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తమను విధుల్లో చేర్చుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు, యూనియన్లు మండిపడుతున్నాయి. ఓ వైపు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే... తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్న ఆర్టీసీ సంఘాలు... ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మికుల ఆలోచన ఈ రకంగా ఉంటే... మరోవైపు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతోంది. దీనిపై సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే సగం రూట్లను ప్రైవేటీకరించేందుకుగాను ప్రతిపాదనలు సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రానికి సమాచారమిచ్చి ముందుకు వెళ్ళాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో కేంద్రానికి కూడా 30 శాతం వాటా ఉండటంతో... కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఒకే అంశంపై అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుండటంతో... ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా ముందుకు సాగుతున్న తరుణంలో... ఈ విషయంలో కేంద్రం నుంచి ఆర్టీసీ కార్మికులకు సానుకూల స్పందన వచ్చే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>