హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR పుట్టుకతోనే భూస్వామి.. నిజాం నుంచి భారీ పరిహారం: KTR -అక్కడుండగా కేసీఆర్ ఫోన్‌కాల్..

CM KCR పుట్టుకతోనే భూస్వామి.. నిజాం నుంచి భారీ పరిహారం: KTR -అక్కడుండగా కేసీఆర్ ఫోన్‌కాల్..

కేసీఆర్, పూర్వీకుల ఇంటి వద్ద కేటీఆర్

కేసీఆర్, పూర్వీకుల ఇంటి వద్ద కేటీఆర్

సీఎం కేసీఆర్ రెండెకరాల నుంచి 2లక్షల కోట్లు సంపాదించారనే విపక్షాల ఆరోపణలను ఖండిస్తూ కొడుకు కేటీఆర్ కీలక వాస్తవాలను బయటపెట్టారు. సీఎం కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అని, కేసీఆర్ తల్లిదండ్రులకు నిజాం నుంచి భారీ పరిహారం అందిందనీ వెల్లడించారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM KCR) గురించి ఆయన కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్ సీఎంగా విపక్షాలు విమర్శించడాన్ని తప్పుపడుతూ, కేసీఆర్ రెండెకరాల నుంచి 2లక్షల కోట్లు సంపాదించారనే ఆరోపణలను ఖండిస్తూ కేటీఆర్ కీలక వాస్తవాలను బయటపెట్టారు.

సీఎం కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అని, ఆనాడు కేసీఆర్ తల్లిదండ్రులకు నిజాం ప్రభువు నుంచి భారీ పరిహారం అందిందనీ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు కామారెడ్డి జిల్లాలో పర్యటించి, కేసీఆర్ పూర్వీకుల గ్రామం కోనాపూర్ (Konapu Village)  (గతంలో పోసానిపల్లి)ని సందర్శించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు..

CM KCR | Centre: కేసీఆర్ సర్కారుకు భారీ షాక్.. అప్పులు నిలిపేసిన కేంద్రం.. సంక్షేమ పథకాలకు దెబ్బ!

మా నాన్న పుట్టుకతో భూస్వామి: సీఎం కేసీఆర్‌ పుట్టుకతోనే భూస్వామి అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆర్ చింతమడకలోనే పుట్టారని, అప్పటికే రెండెకరాల స్థలంలో ఇల్లు కూడా ఉందని చెప్పారు. అయితే తమ కుటుంబ చరిత్ర తెలుసుకోకుండా కొందరు నిందలు వేస్తున్నారని, కేసీఆర్‌ గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ మంగళవారం తన నానమ్మ గ్రామమైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్‌లో పర్యటించారు. రూ.7 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో తన సొంత నిధులు రూ.2.50 కోట్లతో నానమ్మ వెంకటమ్మ పేరిట నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..

కోనాపూర్ గ్రామంలో కేసీఆర్ పూర్వీకుల ఇంటి వద్ద కేటీఆర్

Sedition Law: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు.. రాజద్రోహ చట్టం నిలిపివేత.. మోదీ సర్కార్ యూటర్న్‌తో..


నిజాం నుంచి పరిహారం: కేసీఆర్‌ పుట్టుకతోనే భూస్వామి ఎలాగో కేటీఆర్ వివరించారు. మానేరు ప్రాజెక్టులకు, తమకు(కల్వకుంట్ల కుటుంబానికి) అవినాభావ సంబంధం ఉందన్నారు. 80 ఏళ్ల క్రితం నానమ్మ, తాతలకు సంబంధించిన 600 ఎకరాల భూమి మిడ్‌ మానేరు నిర్మాణంలో ముంపునకు గురవగా.. నిజాం ప్రభుత్వం రూ.2.50 లక్షల పరిహారాన్ని ఇచ్చిందని చెప్పారు. ఆ డబ్బుతో ప్రస్తుత సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లి 300 ఎకరాలు కొనుగోలు చేసి, తమ పూర్వీకులు అక్కడే నివసించారని కేటీఆర్‌ తెలిపారు. లోయర్‌ మానేరులో అమ్మమ్మ కుటుంబ భూములు, అప్పర్‌ మానేర్‌లో పెద్దమ్మ కుటుంబభూములు పోయాయని చెప్పారు. ఇలా మానేరు నిర్మాణంతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని వారికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు.

Narayana | Paper Leak : జగన్ సర్కారుకు భారీ షాక్.. ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్.. జడ్జి సంచలన ఆదేశాలు


కొడుకు కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ ఫోన్‌కాల్: తమ పూర్వీకుల గ్రామం కోనాపూర్‌ మొత్తాన్ని మంత్రి కేటీఆర్‌ కలియదిరిగారు. నానమ్మ ఇంటిని ఆసక్తిగా చూశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్‌.. కేటీఆర్‌కు ఫోన్‌ చేశారు. ఇద్దరూ 5 నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ గతంలో కోనాపూర్‌ ను పోసానిపల్లెగా పిలిచేవారన్నారు. గ్రామానికి రావాలని తనకు ఎప్పటి నుంచో కోరిక అన్నారు. ఇప్పటికి తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. కోనాపూర్‌కు ఏమేం కావాలో తెలుసుకొని, వాటన్నింటినీ నెరవేర్చేలా కృషి చేద్దామని నాన్న చెప్పారని కేటీఆర్‌ తెలిపారు.

First published:

Tags: CM KCR, Kamareddy, KTR, Minister ktr, Trs

ఉత్తమ కథలు