Home /News /telangana /

CM KCR AGAIN PITCHED FOR NEW CONSTITUTION SAYS IT WILL HELP DALITS TRS CHIEF SLAMS PM MODI MKS

New Constitution : కొత్త రాజ్యాంగంపై CM KCR తాజా బాంబు.. దళిత సంఘాలకు సంబంధమేంటి?

కేసీఆర్ తాజా ప్రెస్ మీట్

కేసీఆర్ తాజా ప్రెస్ మీట్

దేశానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాలనే వాదనకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగానికి, దళిత సంఘాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. కొత్త రాజ్యాంగం ఎందుకు కావాలో వివరించారు..

స్వాతంత్ర్యం సాధించుకొని 75 ఏళ్లు పూర్తయినా ఇండియా సర్వతోముఖాభివృద్ధి సాధించలేకపోయిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి అనుగుణంగా దేశానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఉందనే వాదనకు కట్టుబడే ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ఆకాంక్షలో తప్పేమీ లేదన్న ఆయన.. కొత్త రాజ్యాంగం అవసరమేంటో వివరించారు. ప్రగతి భవన్ వేదికగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం.. కొత్త రాజ్యాంగానికి సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర సర్కారులపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు..

కొత్త రాజ్యాంగం కావాలని తాను అనడానికి కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. దేశంలోని దళితుల బాగు కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని ఆయన చెప్పారు. దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దీనికోసమే కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నానని, దీనిని దళిత సంఘాలు వద్దంటాయా? అని అక్షేపించారు. అసలు దళిత సంఘాలకు, రాజ్యాంగానికి ఏమిటి సంబంధం అని సీఎం ప్రశ్నించారు.

CM KCR: మరో సంచలన అంశంలో PM Modiని టార్గెట్ చేసిన కేసీఆర్.. BJPపై నిప్పులుదళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, బీసీల కులగణన కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కోసమే కొత్త రాజ్యాంగం రావాలని కోరుతున్నానని కేసీఆర్ వివరించారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు. 77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు. భారతదేశం అమెరికా కన్నా గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలని సీఎం ఆకాంక్షించారు.

CM KCR అనూహ్యం : సడన్‌గా Rahul Gandhiపై ప్రేమ ఎందుకు? గులాబీ బాస్ ఏం మెసేజ్ ఇస్తున్నారు?రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్న కేసీఆర్.. దానిని అడ్డుకునేందుకు కూడా కొత్త రాజ్యాంగం రావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలా భారతదేశం కూడా మారాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు కేసీఆర్.

Hijab Row: హిజాబ్ వివాదంపై CM KCR సంచలన వ్యాఖ్యలు : చీకట్లోకి సిలికాన్ వ్యాలీ!భారత ఫెడరల్ వ్యవస్థను సవ్యంగా నిర్వహించలేని ప్రధాని మోదీ విదేశాంగ విధానంలోనూ విఫలమయ్యారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతివ్వడంపైనా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా? అమెరికా ఎన్నికలతో మీకేం సంబంధం? ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? ఇది విదేశీ నీతేనా? బుద్ది ఉన్న ప్రధాని ఎవరైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా? అని మోదీపై మాటల తూటాలు పేల్చారు కేసీఆర్.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Pm modi, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు