Home /News /telangana /

CM KCR ACCUSED THE CENTRAL GOVERNMENT OF USING CONSTITUTIONAL SYSTEMS AS POCKET INSTITUTIONS PRV

CM KCR : రాజ్యాంగబద్ద వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటారా? కేంద్రంపై సీఎం కేసీఆర్​ ధ్వజం

కేసీఆర్, మోదీ (పాత ఫొటోలు)

కేసీఆర్, మోదీ (పాత ఫొటోలు)

దేశంలోని ఇతర రాష్ట్రాలతో కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. శ‌నివారం సీఎం కేసీఆర్ హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ (CM KCR) అసహనం వ్యక్తంచేశారు. చివరకు అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని మండిపడ్డారు. ఏం దిక్కుమాలిన దౌర్భాగ్యం ఇదని అడిగారు.  హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రగతి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. భారత బ్యాంకుల నుంచి లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకొని విదేశాలకు పారిపోతున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగారు. ఇలా ఒకపక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ.. పేద ప్రజలకు ఇచ్చే ఉచితాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కార్పొరేట్ దొంగలకు ఇలా లోన్లు ఇవ్వడం ఉచితాలు కాదా? అని అడిగారు కేసీఆర్​. ఇదేనా మేకిన్ ఇండియా అంటే ప్రశ్నించారు.

    ఎఫ్ఆర్‌బీఎం (FRBM) ఆంక్షలను తొలగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 2జీ స్పెక్ట్రమ్‌పై (Spectrum) బీజేపీ ఎన్నో ఆరోపణలు చేసిందన్నారు. ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. 5జీ స్పెక్ట్రం వేలంలో (Spectrum Auction) రూ. 5 లక్షల కోట్లు రావాల్సి ఉంది.. కానీ రూ. లక్షన్నర కోట్లే ఎలా వస్తాయని ప్రశ్నించారు. దీని వెనక మతలబు, కుంభకోణం ఏమిటని ప్రశ్నించారు కేసీఆర్ .



    గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ రూ. 1. 90 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఏ కేసీఆర్‌ తెలిపారు.. కేంద్రం నుంచి వచ్చి కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. రాజ్యంగబద్ధ వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. సమాఖ్య స్పూర్తి, సహకార స్పూర్తిని పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని విమర్శించిన కేసీఆర్‌.. గాంధీకి లేని అవ లక్షణాలు అంటగట్టి అవహేళన చేస్తున్నారని అన్నారు.

    గాలి తప్ప అన్నింటిపై జీఎస్టీ..

    ‘కేంద్రంలోని పెద్దలు ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తారట. ఇదేనా కో ఆపరేటివ్‌ ఫెడరలిజమంటే. ఇప్పటికైనా ప్రధాని తన బుద్ధి మార్చుకోవాలి. ఉచిత పథకాలు బంద్‌ చేయాలని అంటున్నారు. రైతులకు రైతుబంధు పథకం ఇవ్వడం తప్పా. ఉచితాలు తప్పు అయితే ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారు. ఎన్‌పీఏల పేరుతో పెద్ద స్కామ్‌​ నడుస్తోంది. కమీషన్లు తీసుకొని ఎన్‌పీఎలు ప్రకటిస్తున్నారు. ఎన్‌డీలో ఎన్‌పీఏ దందా సాగుతోంది. ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు, చేనేత, శ్మశానాలపై జీఎస్టీ ఎత్తేయండి. గాలి తప్ప అన్నింటిపై జీఎస్టీ విధించారు, మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనకు నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ దేశ ప్రగతి కోసం సంఘర్షణ తప్పదు. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: 5G, Central governmennt, CM KCR, Enforcement Directorate, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు