తెలంగాణలో మరో అద్భుత ఘట్టం... కొండపోచమ్మసాగర్ ప్రారంభించనున్న కేసీఆర్...

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు ఇస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్... ఆ దిశగా జోరుగా అడుగులు వేస్తున్నారు. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.

news18-telugu
Updated: May 26, 2020, 2:54 PM IST
తెలంగాణలో మరో అద్భుత ఘట్టం... కొండపోచమ్మసాగర్ ప్రారంభించనున్న కేసీఆర్...
తెలంగాణలో మరో అద్భుత ఘట్టం... కొండపోచమ్మసాగర్ ప్రారంభించనున్న కేసీఆర్...
  • Share this:
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది అక్షరాల నిజం అని నిరూపిస్తూ... బంగారు తెలంగాణ ఏర్పాటు దిశగా... సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. కేళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి... వన్‌బై వన్ లింక్ ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తున్న కేసీఆర్... శుక్రవారం... అత్యంత ప్రతిష్టాత్మకమైన కొండ పోచమ్మ సాగర్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ అద్భుత ఘట్టానికి సిద్ధిపేట వేదిక కాబోతోంది. నిజానికి ఈ ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. ఈమధ్య కరోనా లాక్‌డౌన్ వల్ల చాలా పనులు పెండింగ్ పడినట్లే... ఇది కూడా పడింది. ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యింది కాబట్టి... ఇక బ్రేక్ పడే ఛాన్సే లేదు.

ఈనెల 29న ఉ.11:30 గంటలకు సీఎం కేసీఆర్ స్వయంగా జలాశయంలోకి నీరు విడుదల చేస్తారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ ఓ హోమం కూడా జరుపుతారని హరీశ్ తెలిపారు.


మార్పూరులో మోటర్ల స్విచ్‌ ఆన్‌ చేయడం ద్వారా గోదావారి జలాలు డైరెక్టుగా కొండపోచమ్మసాగర్‌లోకి వస్తాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వివిధ ప్రాంతాలకు నీటిని అందిస్తారు. ఇలా పంపడం తేలికైన విషయం కాదు. ఎందుకంటే... నీరు సహజంగా కిందికి పారుతుంది. ఇక్కడ... నీటిని 500 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చెయ్యాల్సి ఉంటుంది. అందుకు ఎంతో ఇంజినీరింగ్ టెక్నాలజీ అవసరం. అవన్నీ ఎన్నో కష్టనష్టాలు భరించి పూర్తి చేశారు.

తెలంగాణలోని లక్షల ఎకరాల బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మితమవుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఈ కొండపోచమ్మసాగర్‌ నిర్మాణం చేపట్టారు. గోదావరి నీటిని 100కుపైగా మీటర్ల ఎత్తుకి పంపి... అక్కడి జలశయాలను నింపడానికి కొండపోచమ్మ సాగర్‌ అనుసంధానంగా ఉంటుంది. అందుకే రాబోయే తరాలకు చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోనున్నాయి తెలంగాణలోని రిజర్వాయర్లు. సరిగ్గా వానాకాలం వచ్చే సమయానికి... కొండ పోచమ్మ సాగర్ పనిచేయనుండటంతో... రైతులకు ఎంతో మేలు జరగనుంది.
First published: May 26, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading