బంగారు తెలంగాణ ఒట్టి బూటకం...భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఆసుపత్రి నిర్వహణపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: August 27, 2019, 9:19 PM IST
బంగారు తెలంగాణ ఒట్టి బూటకం...భట్టి విక్రమార్క వ్యాఖ్యలు
మంచిర్యాల ఆసుపత్రిలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీమంత్రి శ్రీధర్ బాబు
  • Share this:
బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పడమే తప్ కేసీఆర్  ప్రభుత్వం  ఆచరణలో చేసింది శూన్యం అని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. రాష్ట్రమంతా విషజ్వరాలతో బాధపడుతున్నారని, ప్రభుత్వం గొప్పలకు పోకుండా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు  సందర్శించారు. ఆసుపత్రి నిర్వహణపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ…మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నరక కూపాన్ని తలపిస్తుందని అన్నారు. విష జ్వరాలతో ప్రజలు ఆస్పత్రికి వస్తే ఒకే బెడ్ పై ఇద్దరు చొప్పున రోగులకు చికిత్స చేయడం హాస్పిటల్ పని తీరుకు నిదర్శనం అన్నారు. ఆస్పత్రిలో డాక్టర్ల , వైద్య సిబ్బంది కోరత ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు.

అనంతరం మాజీమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యను, వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు . ఆస్పత్రిలో సౌకర్యాలు కరువై రోగులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డి సి సి అధ్యక్షురాలు సురేఖ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Published by: Krishna Adithya
First published: August 27, 2019, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading