CLP LEADER MALLU BHATTI VIKRAMARKA TESTED POSITIVE FOR COVID 19 AS CORONA SURGE IN TELANGANA MKS KMM
Mallu Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టికి కరోనా.. ఆస్పత్రిలో అసెంబ్లీ స్పీకర్
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సభ్యులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. ఆదివారం కూడా రెండు వేల పైచిలుకు కొత్త కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు చాలా మంది వైరస్ కాటుకు గురవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సభ్యులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
తాజా టెస్టుల్లో కొవిడ్ పాజిటివ్ గా తేలిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నానని సీఎల్పీ నేత భట్టీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన ఆరోగ్యంపై కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆందోలన చెందొద్దని, క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తరువాత కార్యకర్తలను కలుస్తానని భట్టి చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కూడా కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాటిజివ్‌గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.