Bhatti Vikramarka | ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాల్గొనడం కవితకు అవమానం కానీ తెలంగాణకు కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. లిక్కర్ స్కాంలో కవిత అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆమె విచారణను ఎదుర్కొనేది పోయి ఇది తెలంగాణకు అవమానం అంటున్నారు. దీనిని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కవిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. లిక్కర్ స్కాంలో ఎంతటి పెద్దవారు పాల్గొన్న చర్యలు తీసుకోవాలని దర్యాప్తు సంస్థలను భట్టి విక్రమార్క కోరారు.
ఆప్ పై మండిపడ్డ భట్టి..
తాను గాంధీయవాది అంటూ కేజ్రీవాల్ చెప్పారని..కానీ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. దేశంలో అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామన్న కేజ్రీవాల్ దేశంలో ఏ ప్రభుత్వం చేయని లిక్కర్ స్కాంకు పాల్పడిందని అన్నారు. ఇక అన్నా హజారే ఎక్కడున్నారని భట్టి ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకై 9న (ఈరోజు) ఢిల్లీకి రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకై భారత్ జాగృతి ఆధ్వర్యంలో 10న భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. దీనితో రేపటి విచారణకు హాజరు కాలేనని ఈనెల 15న విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత లేఖ రాసింది. దీనితో ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే కవిత ధర్నా కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు జంతర్ మంతర్ లో భారీ ధర్నా కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఇక 11న ఈడీ విచారణకు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
తంలో సీబీఐ..ఇప్పుడు ఈడీ..
ఇదిలా ఉంటే డిసెంబర్ 11న ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించింది. అయితే అంతకుముందు ఆమె విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. కానీ కవిత అప్పటికే ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల కారణంగా తాను సీబీఐ ఫిక్స్ చేసిన డేట్ కు విచారణకు రాలేనని లేఖ రాశారు. ఈ లేఖపై అప్పట్లో సీబీఐ సానుకూలంగా స్పందించి మరో తేదీని ఖరారు చేశారు. ఆ తేదీన హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో సీబీఐ అధికారులు 6 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడు ఈడీ అధికారులు కవిత విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరి 11న కవిత విచారణతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.