• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CLOSER OF CATTLE SLAUGHTER HOUSES AND RETAIL BEEF SHOPS FROM 0108 TO 0208 SK

హైదరాబాద్‌లో బీఫ్ షాపులు బంద్.. GHMC కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో బీఫ్ షాపులు బంద్.. GHMC కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముస్లింలు ప్రత్యేక శ్రద్ధ వహించి పండగ జరుపుకోవాలని మహమూద్ అలీ సూచించారు. ప్రార్థనలు ఇంటిలోనే చేయాలని అక్కడ కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ లను ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు.

  • Share this:
    బక్రీదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో గోవధ శాలలు, బీఫ్ షాపులు మూతపడనున్నాయి. ఆగస్టు 1, 2 తేదీల్లో బీఫ్ షాపులను మూసివేయాలని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల అమలులో మున్సిపల్ సిబ్బందికి సంబంధిత అధికారులు సహకరించాలని పేర్కొంది.

    ఇక ఆగస్టు 1 నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుందని తెలిపారు. కరోనా వైరస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముస్లింలు ప్రత్యేక శ్రద్ధ వహించి పండగ జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనలు ఇంటిలోనే చేయాలని అక్కడ కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ లను ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. పండగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు ఏర్పాటు చేశారని తెలియజేశారు. వీటికోసం ప్రత్యేక వాహనాలను అదనపు సిబ్బందిని నియమించామని జిహెచ్ఎంసి అధికారులు హోం మంత్రికి తెలిపారు.

    మరోవైపు తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ జితేందర్‌ను భజ్‌రంగ్, వీహెచ్‌పీ ప్రతినిధులు కలిశారు. హిందుత్వ సంస్థల కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ బైండోవర్ పేరుపై వేధించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో యద్దేశ్చగా గోవుల అక్రమ రవాణా సాగుతున్నా ఎందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవడం లేదని, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెబుతున్నా ఏవిధంగా రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు దాటి అక్రమంగా గోవులు హైదరాబాద్ నగరానికి ప్రవేశిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు బక్రీద్ పేరుతో రాజకీయ వత్తిడులకు లొంగకుండా గోహత్య నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు