ప్రపంచ ఖ్యాతిని గాంచిన రామప్ప ఆలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేడు సాయంత్రం దర్శించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రెండురోజుల పాటు వరంగల్‌లో బస చేయనున్న ఆయన నేడు ఆయన సతీమణితో కలిసి ఆలయాన్ని సందర్శించారు.కాగా సీజేఐ దంపతులకు స్థానిక ఎమ్మెల్య సీతక్కతోపాటు ఎంపీ కవితా, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్‌లు స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం సీజే ఎన్వీ రమణ వరంగల్ చేరుకుని నిట్‌లో రాత్రి బస చేయనున్నారు. ఆదివారం ఉదయం వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. తర్వాత జిల్లాకోర్టులో నిర్మించిన నూతన కోర్టు భవనాలను ప్రారంభించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NV Ramana, Ramappa Temple, Warangal