Home /News /telangana /

CIVIL AVIATION MINISTER JYOTIRADITYA SCINDIA AND MINISTER KTR LAUNCHES MEDICINE FROM SKY IN VIKARABAD SU

Medicine from Sky: డ్రోన్లతో మెడిసిన్ పంపిణీ.. దేశంలో తొలిసారి.. ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

(Image-Twitter)

(Image-Twitter)

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును రూపొందించిన సంగతి తెలిసిందే.

    దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరాకు తెలంగాణలోని వికారాబాద్ వేదికైంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును వికారాబాద్ ప్రయోగత్మకంగా చేపట్టారు. శనివారం రోజున మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టును ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. డ్రోన్‌లో ఔషధాల బాక్సులను పెట్టి జ్యోతిరాదిత్య సిందియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేశాయి.

    ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిధియా మాట్లాడుతూ.. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు. ఇలాంటి సాంకేతికతను అందించడమే ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నమని తెలిపారు. డ్రోన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడకూడదని సూచించారు.

    Huzurabad By Election: హుజురాబాద్ లో ఆగిన ప్రచారం.. అటువైపు కన్నెత్తి చూడని నాయకులు.. కారణం అదేనా..

    మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నాం. ఈరోజు చారిత్రాత్మక దినం. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తారు. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమని ఆయన చెబుతుంటారు. రాష్ట్రంలో ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నాం. అధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయవచ్చు. ఆరోగ్య రంగంలోనే కాదు, అనేక రంగాల్లో డ్రోన్‌ వాడొచ్చు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లు వాడుతున్నాం. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే భయపడతారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా కట్టడి చేయొచ్చు’అని చెప్పారు. ఇక, ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్‌ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్‌ వర్సిటీగా మార్చాలని కేంద్ర మంత్రిని సింధియాను మంత్రి కేటీఆర్ కోరారు.





    ఇక, తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనిని వికారాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. వికారాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నెలరోజులపాటు దీనికి సంబంధించిన ట్రయల్‌రన్‌ జరగనుంది. దీనికోసం మారుట్‌ డ్రోన్స్‌, బ్లూ డార్ట్‌, స్కై ఎయిర్‌, టెక్‌ ఈగిల్‌ సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా డ్రోన్లు ఎంత దూరం వెళ్లగలుగుతాయి, బరువైన పేలోడ్స్ తీసుకెళ్తాయి వంటి అంశాలను నెలరోజులపాటు అధ్యయనం చేయనున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Drones, Minister ktr, Telangana, Vikarabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు