హోమ్ /వార్తలు /తెలంగాణ /

గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రారంభం.. ఈ ప్రాంతాల్లోనే..

గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రారంభం.. ఈ ప్రాంతాల్లోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే మెట్రో సర్వీసులు ప్రారంభం కావడంతో ఆర్టీసీ బస్సులను కూడా ప్రారంభించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.

  కరోనా లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఆరు నెలలకు పైగా డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాల్లో మాత్రం యథావిధిగా తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పట్లో బస్సులు తిప్పమని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాదు సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉటుందని.. తద్వారా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాముందని అభిప్రాయపడ్డారు. ఐతే ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త కేసులు భారీ తగ్గడంతో పాటు రికవరీలు పెరగడంతో.. ఆర్టీసీ బస్సు సర్వీసులపై కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మొదట నగర శివారు ప్రాంతాల్లో సిటీ బస్సులను ప్రారంభించారు. బుధవారం నుంచే ఇవి రోడ్డెక్కాయి.

  హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల్లో బస్సు సర్వీసులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ శివారు డిపోల నుంచి 12 బస్సుల చొప్పున సర్వీసులను నడుపుతున్నారు. ఐతే ఈ బస్సులు నగరం లోపలికి మాత్రం రావు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో బస్సులను నడుపుతున్నారు. నగర శివారు గ్రామాల్లోని ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఇటీవల జరిగిన ఆర్టీసీ సమావేశంలో ‌ చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

  గ్రేటర్‌లో 3798 ఆర్టీసీ బస్సులున్నాయి. ఐతే గతేడాది సమ్మె కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొన్ని బస్సు సర్వీసులను పక్కనబెట్టారు. మిగిలిన 3298 బస్సులతో గ్రేటర్‌ బస్సులు 9 లక్షలకు పైగా కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 34 లక్షలమంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. వీటి ద్వారా గ్రేటర్‌ ఆర్టీసికి రోజువారి ఆదాయం రూ. 3 కోట్ల 50 లక్షలు సమకూరుతుంది. ఐతే కరోనా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ పూర్తిగా ఆధాయాన్ని కోల్పోయింది.

  ప్రస్తుతం పరిస్థితులు మెరుగవడంతో మళ్లీ సిటీ బస్సులను తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే మెట్రో సర్వీసులు ప్రారంభం కావడంతో ఆర్టీసీ బస్సులను కూడా ప్రారంభించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించేలా సిద్ధమవుతున్నారు.

  బస్సులు ప్రారంభమైతే కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణ, టికెట్ల జారీ, బస్సుల్లో శానిటైజేషన్‌తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేస్తుననారు. సిటీ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు కండక్టరు అవసరం తప్పనిసరి. రద్దీ కారణంగా బస్సుల్లో కండక్టర్లుకు భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలని చర్చలు జరుపుతున్న అధికారులు.. ముందుగా నాన్‌ స్టాప్‌ బస్సులు, లెగ్జరీ, ఏసీ బస్సులను నడపాలని యోచిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: GHMC, Hyderabad, Rtc, Telangana, Tsrtc