Home /News /telangana /

CITY POLICE HAVE CHANGED CYCLE PATROLLING TO CYBER PATROLLING CP ANJANI KUMAR EVK

సైకిల్ పెట్రోలింగ్‌ నుంచి సైబ‌ర్ పెట్రోలింగ్‌కు ఎదిగాం: సీపీ అంజ‌నీకుమార్‌

ఫిక్కి లేడీస్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఎల్ఓ) సమావేశంల సీపీ అంజనీ కుమార్ (ఫొటో క్రెడిట్ - ఐఎన్‌డీటుడే.కామ్‌)

ఫిక్కి లేడీస్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఎల్ఓ) సమావేశంల సీపీ అంజనీ కుమార్ (ఫొటో క్రెడిట్ - ఐఎన్‌డీటుడే.కామ్‌)

1912లో నిజాం ప్ర‌భుత్వం అబిడ్స్ పోలీస్ స్టేష‌న్‌కు అందించిన 12 సైకిళ్ల‌తో న‌గ‌ర పోలీస్ గ‌స్తీ ప్రారంభ‌మైందని.. నేడు అదే హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ అత్యాధునిక సైబ‌ర్ గ‌స్తీ వ్య‌వ‌స్థ‌ను అందుకుంద‌ని సీపీ అంజ‌నీకుమార్ అన్నారు.  

    గస్తీ నిర్వహణలో అధునాతన సాంకేతిక వ్యవస్థను వినియోగించుకోవడంలో  హైదరాబాద్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ ఎంతో  ఎదిగిందని సీపీ అంజనీ కుమార్ అన్నారు.  ఫిక్కి లేడీస్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వ‌ర్యంలో రాయ‌దుర్గం హెచ్‌కేసీలోని ఓ హోట‌ల్‌లో మంగ‌ళ‌వారం మెరుగైన స‌మాజం కోసం పోలీసు-ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డం అంశంపై ముఖాముఖి నిర్వ‌హించారు.  ఈ సమావేశానికి హాజరైన ఆయన పలు విషయాలను పంచుకొన్నారు.   1912లో అప్ప‌టి నిజాం ప్ర‌భుత్వం అబిడ్స్ పోలీస్ స్టేష‌న్‌కు అందించిన 12 సైకిళ్ల‌తో న‌గ‌ర పోలీస్ గ‌స్తీ ప్రారంభ‌మైందని నేడు అదే హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ అత్యాధునిక సైబ‌ర్ గ‌స్తీ వ్య‌వ‌స్థ‌ను అందుకుంద‌ని అన్నారు.
    దేశంలోనే ఉత్తమమైన సైబర్ ల్యాబ్ మన రాజధానిలో ఉందని సీపీ తెలిపారు. పోలీస్ వ్యవస్థ కొత్తగా వచ్చింది కాదని పూర్వం  ఆహార ధాన్యాల సరఫరా.. వేటగాళ్ల నుంచి వాటి రక్షణకు అవసరం ఉండేదని అన్నారు. అప్పట్లో  ఆహార భద్రతే ప్రధానం ఉండేదని ప్రస్తుతం నేరం చేసే కారణాలు.. వాటి నిర్వచనం మారిపోయిందని అన్నారు. కొద్ది రోజులుగా  ఆఫ్ఘానిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు  ఆధునిక సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు.   ప్ర‌తీ పోలీసు తొలుత ఓ పౌరుడని, ప్ర‌తీ పౌరుడు ఓ పోలీస్ అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి అనుసంధాన క‌ర్త‌గా ఉమా చిగురుపాటి వ్య‌వ‌హ‌రించారు.
    ఎఫ్ఎల్ఓ చైర్ పర్సన్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులు ఎన్నో సార్లు తాము ప్రజల స్నేహితులమని చాటుకున్నారని అన్నారు.  పోలీసు లేకుండా  ఒక్క గంట కూడా ఊహించుకోలేమన్నారు. ప్రస్తుతం   ఆఫ్ఘానిస్తాన్లో జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణ అని  ఆమె అన్నారు.  ముఖ్యంగా  ఆపత్కాలంలో పోలీసుల సేవలు, త్యాగాలు వెల కట్టలేమన్నారు. అన్ని రంగాల వారికి సెలవులు, పండగలు ఉంటాయని పోలీసులకు మాత్రం అలాంటివి ఉండనవి అన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cyberabad police, Hyderabad, Hyderabad police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు