CHRISTMAS CELEBRATIONS IN THE OVER NIGHT IN TELANGANA VRY
Christmas Celebrations : క్రీస్తును స్మరిస్తూ ఘనంగా క్రిస్మస్ వేడుకలు..! చర్చీల్లో కిటకిటలాడుతున్న భక్తులు
Christmas Celebrations
Christmas Celebrations : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా రాత్రి నుండి ఆయా చర్చిల్లో భక్తులు ప్రార్ధనలు చేశారు. ఊరేగింపులు, పలు సందేశాలతో చర్చీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఆయా చర్చిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే పలు పట్టణాలు, చర్చిలతో కిటకిటలాడుతున్నాయి.. కాగా తెలంగాణలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో 97 వ వార్షిక క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. క్రిస్మస్ సంధర్భంగా మొదటి ప్రార్ధన ఉదయం నాలుగు గంటలకు ప్రారంభం కాగా, దేవాలయం నుండి యేసు సిలువను ఊరేగిస్తూ చర్చిలో భక్తులు ఆశీర్వాదాలు అందిస్తూ ఊరేగింపు వేదికపై చేరుకుంది. ఈ సందర్భంగా యేసు నామాన్ని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో సిలువ ఊరేగింపు కొనసాగింది. భక్తులు పరిశుద్ధ మహాత్ముడైన యేసు క్రీస్తును స్మరిస్తూ భజన పాటిస్తూ యేసు క్రీస్తు ప్రార్థన లో పాల్గొన్నారు.
అనంతరం చర్చ్ బిషప్ సల్మాన్ రాజ్ భక్తులకు సందేశాన్ని ఇస్తూ యొక్క లోక రక్షకుడు యేసు సర్వపాపాలను తొలగించి పునీతులను చేస్తాడని తెలియజేశారు. ప్రస్తుత ప్రారంభమవుతున్న కరోనా నుండి సైతం కాపాడాలని యేసు ప్రభువును అని ప్రార్థించాడు. కాగా ఈ ఉత్సవాలు జనవరి ఒకటో తారీకు వరకు జరుగనున్నాయి. వివిధ రాష్ట్రాలతోపాటు దేశ నలుమూలల నుండి ప్రపంచ దేశాల నుండి భక్తులు తరలి వస్తారని కరుణ నిబంధనలు పాటిస్తూ భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని అని చర్చ సల్మాన్ రాజ్ భక్తులకు సూచించారు.
క్రిస్మస్ సందర్భంగా ఖమ్మం చర్చి కాంపౌండ్ ల్లోగల CSI చర్చ్ లో తెల్లవారుజామున క్రీస్మస్ ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చర్చ్ పాస్టర్స్ నుండి దీవెనలు పొందారు..
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.