మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మరోవైపు 450 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా చర్చి కమీటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

  • Share this:
    మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సియస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులంతా చర్చి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండుగ సంధర్బంగా పీఠాధిపతి బిషప్ సాల్మన్ రాజ్ మాట్లాడుతూ తెల్లవారు జామున శిలువతో చర్చి ప్రాంగణంలో ఊరేగింపుగా చర్చి లోపల వేదిక మీదకు చేర్చారు. అనంతరం భక్తులకు దైవ సందేశం చేశారు. క్రిస్మస్ అంటే యేసు ప్రభువు మరణించి లేచిన రోజు అన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చర్చి మెదక్ చర్చి అన్నారు. ఈ ప్రార్ధన మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని పాటలతో పరవశించారు. మరోవైపు 450 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమీటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షీ టీమ్ చర్చి వద్ద పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

    Published by:Sulthana Begum Shaik
    First published: